అరుగులే ఆధారం.. అధికారుల అలసత్వం
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:48 AM
వినియోగదారులు దేవుళ్లంటారు వ్యాపారులు. ఓటర్లు దైవం తో సమానమంటారు రాజకీయనాయకులు. అయితే సేవ లు పొందేందుకు వచ్చే పౌరులు మాకేమీ కాదంటున్నారు మునిసిపల్ ఉద్యోగులు.
అరుగులే ఆధారం.. అధికారుల అలసత్వం
పౌరసేవలందిచడంలో నిర్లక్ష్యం
మిర్యాలగూడ టౌన, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): వినియోగదారులు దేవుళ్లంటారు వ్యాపారులు. ఓటర్లు దైవం తో సమానమంటారు రాజకీయనాయకులు. అయితే సేవ లు పొందేందుకు వచ్చే పౌరులు మాకేమీ కాదంటున్నారు మునిసిపల్ ఉద్యోగులు. జనన, మరణ ధ్రువీకరణ పత్రా లు, గృహ నిర్మాణ అనుమతులు, వ్యాపార లైసెన్సులు, వృద్ధ, దివ్యాంగుల పింఛన్లు, పావలా వడ్డీ రుణాలు ఆస్తి, నీటి పన్ను చెల్లింపుల కోసం నిత్యం వందలాది మంది వ స్తుంటారు మునిసిపల్ కార్యాలయానికి. అయితే ఆ సేవలు పొందేందుకు వచ్చే వారి కోసం కుర్చీ, టేబుల్ ఏ ర్పాటు చేయడం లేదు మునిసిపల్ అధికారులు. గ్రేడ్ తగ్గుతుందనో, ర్యాంకు పడిపోతుందనో, మరే కారణం చేతనో కానీ.. నిలువెత్తు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు పురపాలకులు. సేవలు పొందేందుకు కార్యాలయానికి వచ్చిన పౌరులు అక్కడి అరుగులపై లేదా కార్యాలయంలో పార్క్ చేసిన వాహనాలపై ఆధారపడి తమ దరఖాస్తులు నిం పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.