Share News

ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:29 AM

లేబర్‌ కోడ్ల రద్దు, రవాణా రంగ పరిరక్షణ, కార్మికుల ఉపాధి రక్షణ, ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9వ తేదీన జరిగే సమ్మెలో ఆటో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని నల్లగొండ జిల్లా సీఐటీయూ సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, ఆటో యూనియన్‌ బీఆర్‌టీయూ అధ్యక్షుడు కలగోని యాదయ్య, సీఐటీయూ నాయకుడు ధరావత్‌ హనుమంతునాయక్‌ పిలుపునిచ్చారు.

ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలి

నల్లగొండ రూరల్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): లేబర్‌ కోడ్ల రద్దు, రవాణా రంగ పరిరక్షణ, కార్మికుల ఉపాధి రక్షణ, ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9వ తేదీన జరిగే సమ్మెలో ఆటో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని నల్లగొండ జిల్లా సీఐటీయూ సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, ఆటో యూనియన్‌ బీఆర్‌టీయూ అధ్యక్షుడు కలగోని యాదయ్య, సీఐటీయూ నాయకుడు ధరావత్‌ హనుమంతునాయక్‌ పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని పెద్ద గడియారం సెంటర్లో సీఐటీయూ, బీఆర్‌టీయూ ఆటో సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిన డీజిల్‌, 15 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిన పెట్రోల్‌ వాహనాలను ఉపయోగించొద్దని షరతు విధించిందన్నారు. వాహ నాలతో స్వయం ఉపాధి పొందుతున్న డ్రైవర్లకు ఇది పెను భారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు టౌన్‌ కన్వీనర్‌ అవుట రవీందర్‌, నాయకులు నఫీజ్‌, కేశవులు, బాబా, శంకర్‌, మహమూద్‌, గోరే, ఇబ్రహీం, సైదులు, రాములు, శంకర్‌ పాల్గొన్నారు.

జీవోను రద్దు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం దుకాణాలు, స్థాపనల చట్టంలోని సెక్షన్‌ 16,17 సవరణ చేస్తూ 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచుతూ ఈ నెల ఐదో తేదీన ప్రకటించిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఇది పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు లాభం చేకూర్చడానికి దోహదపడుతుందని, కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 12:29 AM