Share News

’స్థానికం’లో జంపింగ్‌ల హవా..!

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:25 PM

త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఆశించే వారిలో ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలోకి వచ్చిన వారే అధికంగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీనే న మ్ముకుని పని చేసిన పాత వారిని పక్కన బెట్టి తమకే టికెట్‌ కావాలంటూ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

’స్థానికం’లో జంపింగ్‌ల హవా..!

-ఆశావహుల్లో వారి సంఖ్యే అధికం

-సొంత లాభం కోసమే పార్టీల ఫిరాయింపు

-టికెట్ల కోసం ముఖ్యనేతలపై ఒత్తిడి

-పార్టీనే నమ్ముకున్న వారి పరిస్థితి దయనీయమే

మంచిర్యాల, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఆశించే వారిలో ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలోకి వచ్చిన వారే అధికంగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీనే న మ్ముకుని పని చేసిన పాత వారిని పక్కన బెట్టి తమకే టికెట్‌ కావాలంటూ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ అభివృద్ధి కోసం పైసా ఖర్చు పెట్టకుండా, ఎలాం టి కార్యక్రమాలు నిర్వహించని వారు తమకు ఎంపీ టీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌తోపాటు రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌/కౌన్సిలర్‌ ఎన్నికలకు టికెట్లు కా వాలని తిరుగుతున్నారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీతో లబ్ది పొందిన వారు సైతం నేడు అధికారంలో ఉన్న పార్టీలో చేరి తమ సంపాదనను పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. ఏళ్ల తరబడి పార్టీని పట్టుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేసి, ఎన్నో సాదకబాధకాలకు ఓర్చిన వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పక్కకు జరగాల్సిన ద యనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో వి విధ నియోజక వర్గాలకు చెందిన ముఖ్య నేతలు ఆలో చించాల్సి అవసరం ఎంతైనా ఉందని, ఎవరికి టికెట్‌ ఇవ్వాలో....ఎవరెవరికి ఇవ్వకూడదో అధిష్టానం కూడా సరియైన నిర్ణయం తీసుకోవాలని పాత క్యాడర్‌కు చెం దిన పలువురు నాయకులు కోరుతున్నారు.

ఆ రెండు నియోజక వర్గాల్లోనే అధికం...

జంపింగ్‌ జిలానీలు జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాల్లోనే అధికంగా ఉన్నారు. ఆ నియోజక వర్గాల ఎమ్మెల్యేలు గడ్డం వివేకానంద, గడ్డం వినోద్‌లు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్‌లో చేరారు. అంతకు ముందు వివేకానంద బీజేపీలో ఉండగా, ఎన్ని కలకు కొద్ది రోజుల ముందుగానే కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆయనతోపాటు పెద్ద మొత్తంలో అనుచర వర్గం కూడా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే బెల్లం పల్లి నియోజక వర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడి ఎమ్మెల్యే వినోద్‌ సైతం అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో చేరారు. ఆయన అనుచర వర్గం కూడా పార్టీ మారింది. అలాగే ఇతర పార్టీలకు చెందిన నాయ కులు సైతం పెద్ద ఎత్తున పార్టీలు మారారు. ప్రస్తుతం ఆ ముఖ్య నేతలతోపాటే పార్టీలు మారిన నాయకులు ప్రస్తుతం నియోజక వర్గాల్లో పెత్తనం చెలాయిస్తున్నా రు. ముఖ్య నేతలు పార్టీలు మారక ముందు కాంగ్రెస్‌ జెండాలు మోసి, పార్టీ అభివృద్ధి కోసం పాటు పడిన వారికి పెద్దగా ప్రాధాన్యం లేదనే ప్రచారం జరుగుతోం ది. ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికే టికెట్లు కేటాయిస్తారనే అభద్రాతాభావం పాత క్యాడర్‌లో నెలకొంది. ఇదిలా ఉండగా ఈ పరిస్థితి మం చిర్యాల నియోజక వర్గంలో కొంతమేర తక్కువగానే ఉం ది. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మొదటి నుంచి కాంగ్సెస్‌లోనే ఉన్నారు. 2018 ఎన్నికల్లో పోటీ చే సి ఓటమి పాలైనప్పటికీ ఆయన పార్టీ మారలేదు. అం తకు ముందు నుంచే పార్టీని అంటిపెట్టుకుని దాని అభి వృద్ధికి కృషి చేశారు. ఆయనతోపాటే పాత క్యాడర్‌ కూ డా పార్టీనే అంటిపెట్టుకుని ఉంది. ఇదిలా ఉండగా 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి భారీగా నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో పాత క్యాడర్‌తోపాటు కొత్తగా పార్టీలో చేరిన వారు సైతం టి కెట్‌ రేసులో ఉన్నారు. అయితే పాత క్యాడర్‌ పటిష్టంగా ఉండటంతో నియోజక వర్గంలో వారికే ప్రాధాన్యత ఉం టుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు రెండేళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన వారిలో సైతం కొందరు ప్రజాధారణ కలిగి ఉన్నారు. ఈ క్రమంలో పా త క్యాడర్‌తోపాటు కొత్తగా చేరి, ప్రజాధారణ కలిగిన నాయకులకు కూడా టికెట్లు దక్కుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే జిల్లాలోని మూడు నియోజక వర్గాలకు చెందిన ముఖ్య నేతలు టికెట్ల వి షయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థి తులు ఉన్నాయి. ఓ వైపు పార్టీ అధిష్టానం గెలుపు గు ర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో పా త, కొత్త క్యాడర్‌ అనే తేడా లేకుండా టికెట్ల పంపకాలు ఉంటాయనే చర్చ సాగుతోంది.

ఓటర్ల లెక్కల తీస్తూ....

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆశావ హులు తమ కార్యాచరణ అమలు పరుస్తున్నారు. తన పరిధిలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ? తమకు అనుకూలం గా ఎందరు ఉంటారు ? ఇతర పార్టీల ఓటర్లు ఎవ రున్నారు ? అంటూ లెక్కలు వేస్తున్నారు. ఇతరుల నుం చి ఓట్లు ఎలా రాబట్టు కోవాలో ప్రణాళికలు రచిస్తు న్నారు. ఈ క్రమంలో తమ పరిధిలోకి వచ్చే ఓటర్లను మచ్చిక చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది నాయకులైతే గతంలో ఉన్న తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతు న్నారు. తద్వారా ఓటర్ల మెప్పు పొందేందుకు సర్వశక్తు లా ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్ని కలు ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుండగా, గ్రామాల్లోనూ ఈ అంశంపైనే అధికంగా చర్చ సాగుతోంది.

Updated Date - Oct 05 , 2025 | 11:25 PM