ఆదిదేవుడి ఆగమనం...
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:18 PM
గణేశచతుర్థి అంటేనే పిల్లలకు అత్యంత ఇష్టమైన పండుగ. బొజ్జ గణపయ్య తయారీ నుంచి అలంకారం, పూజా, నైవేద్యాలు, ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఎంతో ఇష్టంగా పా ల్గొంటారు. ఎంతో భక్తిశ్రద్ధలతో నవరాత్రులను జరుపుకుంటారు.
ఊరూవాడ గణపతి సంబరాలు...
నేడు వినాయక చవితి
వాడవాడలా వెలిసిన మండపాలు
నస్పూర్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : గణేశచతుర్థి అంటేనే పిల్లలకు అత్యంత ఇష్టమైన పండుగ. బొజ్జ గణపయ్య తయారీ నుంచి అలంకారం, పూజా, నైవేద్యాలు, ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఎంతో ఇష్టంగా పా ల్గొంటారు. ఎంతో భక్తిశ్రద్ధలతో నవరాత్రులను జరుపుకుంటారు.
ఆదిదేవతల్లో తొలి పూజలందుకునే గౌరీసుతుడి రూ పం వ్యక్తిత్వ వికాసానికి పాఠం. ఆయనకు చేసే పూజ లు జీవ వైవిద్యానికే ప్రతీకగా నిలుస్తాయి. రంగుల విగ్రహాల కారణంగా నీటి కాలుష్యం ఎక్కువ అవు తు న్నందున ఇళ్లలో మట్టి విగ్రహాలను పూజించాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. విఘ్నేశ్వరుడు ప్ర కృతి ప్రియుడు కావడం వలన ఆయన పూజా విధా నంలో కూడా పత్రాలను, నైవేద్యాలను ఆకులతో ఆరా ధించే పండగా వినాయక చవితి ఒక్కటే. ఈ నెల 27 బుధవారం వినాయక చవితి సందర్భంగా జిల్లాలో ఉ త్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఫ 21 రకాల పత్రులతో పూజలు...
వినాయకుడిని ఆరాధిచండమంటేనే ప్రకృతిని పూ జించడమని భావిస్తారు. పూజలో వినియోగించే మట్టి నుంచి పసుపు, ఆకులు అణువణువునా ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ప్రకృతిలో లభించే 21 రకాల పత్రిలో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నట్లు గుర్తించారు. గణ పతికి ఇష్టమైన గరకను పూజలో ఖచ్చితంగా వినియో గిస్తారు. ఉమెత్త ఆకు, దర్బ, రేగు ఆకు, ఉత్తరేణి, జి ల్లేడు, సీతాఫలం, జమ్మి ఆకు, తెల్లమద్ది ఆకు, మారేడు, బిల్వా, మరువక ఆకులు, వర్షాకాలంలోనే లభించే వీటి వలన ఈ సీజన్‌లో వ్యాప్తి చెందే ఆరోగ్య సమస్యలకు ఎంతో ఉపయోగకరంగా(5వ పేజీ తరువాయి)
ఉంటాయని చెబుతారు. పుష్పం పత్రం, ఫలంతో యం అంటూ అధిదేవుడైనా గణ పతికి తొలిపూజలు అందిస్తారు. వినాయక అష్టోత్తర శతనామాలు చదువు తూ స్వామికి పత్రాలు, పూలతో పూజా చేయాలి. దీపం, నైవేద్యం తాంబూలం, నీరాజనం, మంత్రపుష్ఫం, ప్రదక్షి ణం చేసిన అనంతరం పంచామృతాలు, కొబ్బరి నీళ్లు క లిపిన తీర్థం తీసుకోవాలి.
ఫ మట్టి విగ్రహాలే మేలు...
గణపతి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ హితం గా మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజించడానికి భక్తు లు మొగ్గు చూపుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్, రసా యన రంగులతో తయారు చేసి పీఓపీ విగ్రహాలు నీటి ని కలుషితం చేసి హాని కలిగిస్తాయి. పీఓపీ తయారు చేసిన విగ్రహాలు నీటిలో కరుగడానికి చాలా సమయం పడుతోంది. అదే మట్టితో తయారు చేసిన విగ్రహం తక్కువ సమయంలో నీటిలో కరిగిపోతుంది. నస్పూర్ పట్టణంలోని పటేల్ కాలనీలో గణేష్ బొమ్మల పరిశ్రమ లో గణపతి మట్టి విగ్రహాలను సహాజ సిద్ధమైన రం గులతో తయారు చేస్తున్నారు. ఎనిమిది ఇంచుల మట్టి విగ్రహం రూ. 30 రూపాయలకు, 7ఫీట్ల మట్టి విగ్ర హం రూ. 14వేల నుంచి 15వేల వరకు అమ్మకాలు జ రుగుతున్నాయి.
ఫ మార్కెట్లో సందడి..
దండేపల్లి : బుధవారం వినాయక చవితి సందర్భం గా మార్కెట్లో సందడి నెలకొంది. రెండు రోజుల ముం దు నుంచే వినాయక ప్రతిమలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు భక్తులు. వ్యాపారులు రకరకాల వినాయకులను సిద్ధంగా ఉంచారు. రూ. 1500 వందల నుంచి 30 వేల వరకు ధరలు పలుకుతున్నాయి. దీంతో మార్కెట్లో వినాయకుల అమ్మకాలు ఊపందుకున్నాయి.