Share News

kumaram bheem asifabad- విద్యా వ్యవస్థ బలోపేతమే ధ్యేయం

ABN , Publish Date - Sep 20 , 2025 | 10:30 PM

విద్యా వ్యవస్థ బలోపేతమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి అన్నారు. హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, సెక్టోరియల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

kumaram bheem asifabad- విద్యా వ్యవస్థ బలోపేతమే ధ్యేయం
వీసీలో పాల్గొన్న అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈఓ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): విద్యా వ్యవస్థ బలోపేతమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి అన్నారు. హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, సెక్టోరియల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పూర్వ ప్రాథమిక పాఠశాలల నియమకాలు, ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ ఏర్పాటు, ఎఫ్‌ఎల్‌ఎన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ల్యాబ్‌లు, ఏక్‌ పేడ్‌ మాకే నామ్‌ కార్యక్రమంలో నాటిన మొక్కల వివరాలు ఇతర అంశాలపై అధికారులతో సమీక్షించారు. పండమెంటల్‌ లిటరసీ, న్యూమరసీలో జిల్లాల వారీగా ప్రగతి, జిల్లా పరిషత్‌, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఖాన్‌ అకాడమి, ఫిజిక్స్‌ వాలా తరగతులు లైబ్రరీల నిర్వహణ, ఏర్పాటు, బ్యాడ్‌ యాక్టివిటీస్‌, డ్రాప్‌ బాక్స్‌ క్లియరెన్స్‌, యూడైస్‌, అపార్‌ స్థాయి, ప్రధాన మంత్రి పోషన్‌, పర్ఫార్మెన్స్‌ గ్రేడ్‌ ఇండికేటర్స్‌ ఇతర అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వం విద్యారంగ బలోపేతానికి అమలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లా, మండల, గ్రామ స్థాయిలో పకడ్బంధీగా చేపట్టాలని, ప్రతి ఒక్కరూతమ వంతు బాధ్యతగా విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం నుంచి అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి జిల్లా విద్యాధికారి దీపక్‌ తివారి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ ప్రభుత్వం చేట్టిన పాఠశాలల అభవృద్ధి, అర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ల్యాబ్‌ ఇతర కార్యక్రమాలను జిల్లా విద్యాశాఖ అధి కారుల సమన్వయంతో ప్రతి పాఠశాలలో అమలు చేసే విధంగా చర్యలు తీసుంటు న్నామని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల లను నిరంతరం సందర్శించి పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, పాఠశాలలో నెలకొన్న సమస్యలపై పర్యవేక్షించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరయల్‌ అధికారి శ్రీనివాస్‌, అబిద్‌ అఈ, మధుకర్‌, భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 10:30 PM