ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - May 08 , 2025 | 11:56 PM
ఆర్టీసీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, గ్రామీణ ప్రాంతా ల్లో బస్సులు ఎక్కడ నడిపించాలో అధికారులు సర్వే చేసి తక్షణమే బస్సులు నడిపించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం
ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు
శాలిగౌరారం, మే 8 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, గ్రామీణ ప్రాంతా ల్లో బస్సులు ఎక్కడ నడిపించాలో అధికారులు సర్వే చేసి తక్షణమే బస్సులు నడిపించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మోత్కూరు నుంచి ఉప్పల్ ఎక్స్‌రోడ్డు వరకు వెళ్లే బస్సును గురువారం శాలిగౌరారంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద వారు ప్రారంభించారు. అనంతరం వారు బస్సు ఎక్కి టికెట్ తీసుకుని శాలిగౌరారం మండల కేంద్రంలో తిరిగారు. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే సామేలు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో అన్ని డిపార్ట్‌మెంట్ల కంటే ఎక్కువగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు క్రమశిక్షణతో పాటు తక్కువ వేతనానికి పనిచేస్తున్నారని అన్నారు. కార్మికుల, ఉద్యోగుల కృషిని ప్రభుత్వం త్వరలో గుర్తిస్తుందన్నారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను అర్ధం చేసుకొని కార్మికులు సమ్మెకు వెళ్లకుండా విరమించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. శాలిగౌరారం మండల నుంచి ఇతర ప్రాంతాలకు బస్సులు నడిపించాలని ఆర్‌ఎంను కోరారు. కార్యక్రమంలో నల్లగొండ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కొణతం జానరెడ్డి, నల్లగొండ డిపో మేనేజర్ శ్రీనాథ్, డిపో ఏడీ సీ శౌరయ్య, మార్కెట్ కమిటీ చైర్మన పాదూరి శంకర్ రెడ్డి, వైస్ చైర్మన నరిగే నర్సింహ, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూక కిరణ్ కుమార్‌యాదవ్, కందాల సమరంరెడ్డి, సుధాకర్, మ హేందర్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, చింత ధనుంజయ్, పరమేష్, షేక్ ఇంతియాజ్ అహ్మద్, జనార్ధన, వేణుగోపాల్‌రెడ్డి, దేవేందర్, వెంకట య్య, గోపినాథ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.