kumaram bheem asifabad- గర్భిణి శ్రావణిని హత్య చేసిన నిందితులను శిక్షించాలి
ABN , Publish Date - Oct 28 , 2025 | 10:07 PM
దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన తలండి శ్రావణి అనే గర్భిణిని కులాంతర వివాహం చేసుకున్నదని హత్యం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట ఎస్పీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కుమ్రం నీలాదేవి పోలీసులను ఆదేశించారు. నిండు గర్భిణీ అయిన శ్రావణిని గొడ్డలితో నరికి హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం గెర్రె గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభుయలను పరామర్శించి హత్య సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు.
దహెగాం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన తలండి శ్రావణి అనే గర్భిణిని కులాంతర వివాహం చేసుకున్నదని హత్యం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట ఎస్పీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కుమ్రం నీలాదేవి పోలీసులను ఆదేశించారు. నిండు గర్భిణీ అయిన శ్రావణిని గొడ్డలితో నరికి హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం గెర్రె గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభుయలను పరామర్శించి హత్య సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. గిరిజన మహిళను, నిండు గర్భిణీని, పుట్టబోయే బిడ్డను హత్య చేసిన శివార్ల సత్తయయను, సహకరించిన వారందరిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తూ నష్ట పరిహారం వెంటనే అందించాలని జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. హత్యలో పాల్గొన్న వారందరిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మహిళలపై రోజు రోజుకు దాడులు పెరిగి పోతున్నాయని నేటి ఆధునిక యుగంలో కుల దురహంకార హత్యలకు పాల్పడడం సభ్య సమాజం తలదించుకోవాల్సిన దుస్థితన్నారు. ఆమె వెంట డీఎస్పీ వాహిదుద్దీన్, ఎస్సై విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆదివాసీ కోయ సంక్షేమ సంఘం, అంబేద్కర్ సంఘం, కోలావార్ సంఘం, మహిళా సంఘాల సభ్యులు కమిషన్ సభ్యురాలి ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.