నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:22 PM
వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్య కేసులో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షు డు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు.
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 28 (ఆంధ్ర జ్యోతి) : వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్య కేసులో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షు డు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. పోలీసు యంత్రాంగం అరెస్టు చే యడంలో జాప్యం చేయడంతో నిందితులు అరె స్టు కాకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా ర ని తెలిపారు. ఈ స్టేపై బీజేపీ న్యాయవాదులు హైకోర్టులో బలంగా వాదనలు వినిపించడంతో హైకోర్టు స్టేను వెకెట్ చేసిందన్నారు. దీంతో మఽ దుకర్ ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు వ్యక్తు లను అరెస్టు చేయడానికి మార్గం సుగమం అ య్యిందన్నారు. పోలీసులు వారిని అరెస్టు చేసి వా రి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. గతంలో నింది తులను శిక్షిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గ డ్డం వినోద్ నిందితులతో అధికారిక కార్యక్రమాల ను చేపడుతున్నారని ఇది సరైంది కాదన్నారు. ఇ ప్పటికైనా నిందితులను శిక్షించడానికి ఎమ్మెల్యే స హకరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, నాయకులు మఽ దు, తిరుపతి, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
డీసీపీకి వినతి పత్రం
మధుకర్ ఆత్మహత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చే యాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్, నా యకులు డీసీపీ భాస్కర్‌కు వినతి పత్రం అందించారు. నిందితుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యా యం చేయాలని డిమాండ్ చేశారు.