T. Lakshman Goud Elected President: ఎక్సైజ్ టీజీవో ఫోరం రాష్ట్ర కమిటీ ఎన్నిక
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:00 AM
తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారుల (టీజీవో) ఫోరం రాష్ట్రస్థాయి ఎన్నికలు మంగళవారం ఏకగ్రీవంగా జరిగాయి..
అధ్యక్షుడిగా టి.లక్ష్మణ్‌గౌడ్
హైదరాబాద్, డిసెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారుల (టీజీవో) ఫోరం రాష్ట్రస్థాయి ఎన్నికలు మంగళవారం ఏకగ్రీవంగా జరిగాయి. నాంపల్లిలోని టీజీవో భవన్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో ఫోరం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా టి.లక్ష్మణ్‌గౌడ్, ఎం.పి.ఆర్.చంద్రశేఖరరావు ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా బి.ప్రవీణ్‌కుమార్, ట్రెజరర్‌గా కె.విజయ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్లుగా జి.దేవేందర్‌రావు, ఎల్.రామకృష్ణ, కె.రాగవీణ, కె.శ్రీనివాస్, ఎస్.నర్సిరెడ్డి, వి.రాజశేఖర్‌రావు, ఇ.ఏడుకొండలు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎం.బి.కృష్ణ యాదవ్, సహాయ అధికారి కె.రామారావు ప్రకటించారు.