Share News

Minister Seethakka: పేదరిక నిర్మూలనలో టీజీఎల్‌పీ ఆదర్శంగా నిలవాలి

ABN , Publish Date - Oct 14 , 2025 | 02:54 AM

తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమం (టీజీఎల్‌పీ) దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పేదరిక నిర్మూలన నమూనాగా నిలవాలని మంత్రి సీతక్క...

Minister Seethakka: పేదరిక నిర్మూలనలో టీజీఎల్‌పీ ఆదర్శంగా నిలవాలి

  • బ్రాక్‌ సంస్థతో సమావేశంలో మంత్రి సీతక్క

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమం (టీజీఎల్‌పీ) దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పేదరిక నిర్మూలన నమూనాగా నిలవాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. సోమవారం సచివాలయంలో అంతర్జాతీయ సంస్థ బ్రాక్‌ (బిల్డింగ్‌ రీసోర్సెస్‌ అక్రాస్‌ కమ్యూనిటీస్‌) ప్రతినిధుల బృందంతో జరిగిన సమావేశంలో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని అత్యంత పేద కుటుంబాలను గుర్తించి, వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే టీజీఎల్‌పీ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఐదు జిల్లాల పరిధిలోని ఎనిమిది మండలాల్లో టీజీఎల్‌పీ అమలవుతోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా బ్రాక్‌ సంస్థ సహకారంతో ఇప్పటివరకు 3,554 అత్యంత పేద కుటుంబాలను గుర్తించి, మహిళా సమాఖ్యల ద్వారా 108 మంది నిపుణులను నియమించి లబ్ధిదారులకు శిక్షణ అందిస్తున్నట్లు మంత్రి వివరించారు

Updated Date - Oct 14 , 2025 | 02:54 AM