జాతీయ లోక్ అదాలత్‌లో 1.93 లక్షల కేసులు రాజీ
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:29 AM
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో 1,93,439 కేసులు రాజీ చేశామని డీజీపీ జితేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సైబర్ నేరాల బాధితులకు రూ.53 కోట్లు చెల్లింపు
హైదరాబాద్, జూన్15(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో 1,93,439 కేసులు రాజీ చేశామని డీజీపీ జితేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 6,294 సైబర్ నేరాలకు సంబంధించి 6,848 మంది బాధితులకు రూ.53కోట్ల సొమ్మును రిఫండ్ చేయించామని తెలిపారు. గత త్రైమాసికంలో జరిగిన మెగా లోక్ అదాలత్‌లో 1,83,182 కేసులను రాజీ చేయించగా ఈ సారి వీటి సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు.
జరిమానా విఽధించతగిన ఎఫ్‌ఐఆర్ కేసులు 22,095, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కేసులు 8,922, ఈ-పెట్టి కేసులు 84,601, ఎంవీ యాక్ట్ కేసులు 71,527 రాజీ చేయించామని వివరించారు. సైబర్ నేరాల్లో బాధితులకు సొమ్ము వాపసు చేయించడంలో హైదరాబాద్ కమిషనరేట్ తొలి స్ధానంలో ఉందని, తర్వాత స్ధానాల్లో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సంగారెడ్డి జిల్లా ఉన్నాయని తెలిపారు.