kumaram bheem asifabad- ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్
ABN , Publish Date - Oct 26 , 2025 | 10:24 PM
ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పట్టుకుంది. దేశ వ్యాప్తంగా పని చేస్తున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టీచర్ ఎలిబిటి టెస్ట్(టెట్)ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన తీర్పుతో జిల్లాలోని ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. 2009 రైట్ టు ఎడ్యూకేషన్(ఆర్‌టీఈ) చట్టం అమలులోకి వచ్చిన తర్వాత నియమించబడిన ఉపాధ్యాయలందరు రెండు సంవత్సరాల్లోగా టెట్ పరీక్ష ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది.
- పదోన్నతులకు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు
కాగజ్‌నగర్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పట్టుకుంది. దేశ వ్యాప్తంగా పని చేస్తున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టీచర్ ఎలిబిటి టెస్ట్(టెట్)ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన తీర్పుతో జిల్లాలోని ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. 2009 రైట్ టు ఎడ్యూకేషన్(ఆర్‌టీఈ) చట్టం అమలులోకి వచ్చిన తర్వాత నియమించబడిన ఉపాధ్యాయలందరు రెండు సంవత్సరాల్లోగా టెట్ పరీక్ష ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది. లేని పక్షంలో ప్రమోషనలు పొందటం మార్గం ఉండదని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొనడంతో టెన్షన్ మొదలైంది. జిల్లాలో 800 మంది ప్రభుత్వ, ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను ఈ తీర్పు ప్రభావితం చేయనున్నది.. కాగా ఉద్యోగ విరమణకు ఐదేళ్ల సర్వీసులోపు ఉన్న టీచర్లు మినహాయించి మిగితా అంతా టెట్‌పరీక్ష ఉత్తీర్ణత కావాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం ఇప్పుడు విద్యాశాఖలోకలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ తీర్పు ప్రతుల కాపీలపైనే జోరుగా చర్చా సాగుతోంది. టెట్‌పరీక్ష అర్హత లేకుంటే ఉపాధ్యాయులకు ప్రమోషన్ల అవకాశం ఉండదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఆయా సంఘాల నాయకులు భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు.
- విద్యాహక్కు చట్టం అమల్లోకి..
విద్యాహక్కు చట్టాన్ని 2009లో అమల్లోకి తెచ్చింది. దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయులందరికి ఒకే రకమైన విద్యార్హత, ప్రమాణాలుండాలని ఇందుకు సంబంఽధించిన విధి విధానాలను విద్యా హక్కు చట్టంలో పేర్కొన్నది. దీంతో 2010 నుంచి నిర్వహించిన టీచర్ల నియామాకాల్లో నేషనల్ కౌన్సెల్‌ఫర్ టీచర్ ఎడ్యూకేషన్(ఎన్‌సీటీఈ) టెట్‌పరీక్షను తప్పసరి చేయగా, ముందుగా టెట్ రాసి అందులో ఉత్తీర్ణులైన వారు డీఎస్సీ రాసి ఉద్యోగాలు పొందారు. కాని 2010 కన్నా ముందు సర్వీసులోఉన్న టీచర్లు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కొనసాటానికి టెట్‌పరీక్ష రాయాలని ఎన్‌సీటీఈ ఎక్కడా పేర్కొనలేదు. దీంతో ప్రమోషన్ పొందటానికి మాత్రమే టెట్ రాయటం జరిగేది. కాని ఇటీవల టెట్‌రాస్తేనే ఉద్యోగం ఉంటుందన్న ఉత్తర్వులు ఉపాధ్యాయులనుకంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం నిర్వహిస్తున్న టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే కేటగిరిల ఓసీలకు 90 శాతం, బీసీలకు 75, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం తెచ్చుకోవాల్సి ఉంటుంది. 2010 కన్నా ముందున్న ఇన్ సర్వీసు టీచర్లంతా తమను టెట్‌నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎన్‌సీటీఈకి ఆయా సంఘాల నాయకులు విజ్ఙప్తి చేస్తున్నారు. కాని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ విజ్ఙప్తి తిరస్కరించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. 2010 కన్నా ముందు డీఎస్సీల్లో ప్రాథమిక పాఠశాలల్లో నియమితులైన వాళ్లలో ఎక్కువ మంది బీఈడీ పూర్తి చేసిన వారు ఎక్కువ మంది ఉన్నారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గతంలో సర్వీసులో కొనసాగుతున్న టీచర్ల విద్యార్హతల గురించి కూడా చర్చ నడుస్తోంది.
ఫ చొరవ చూపాలి..
ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాలు రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. టెట్ అర్హతపై సడలింపులు లేదా ప్రత్యామ్నాయ పరిష్కారాలు అవస రమని ఒత్తిడి చేస్తున్నారు. ఎప్పుడో చదువుకున్న ఉపాధ్యాయులకు ఇప్పుడు టెట్ అర్హత చేయడం సరికాదం టున్నారు. గతంలో ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారమే తాము కొనసాగుతు న్నామని చెబుతున్నారు. కాగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రమోషన్లు పొందకుండా సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న ఉపాధ్యాయుల కొలువుల్లో కొనసాగడానికి టెట్ రాయాల్సి ఉందన్న ఆదేశాలతో ఉద్యోగ భద్రతపై సందేహాలు నెలకొన్నాయి. మారిన కాలనుగుణంగా టెట్‌పరీక్ష ఇంటర్ స్థాయిలో ప్రశ్నలు ఉండడంతో పాటు అర్హత సాఽధించేందుకు కూడా ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో విద్యను అందించే టీచర్లు తమ ఉద్యోగాన్ని నిలుపుకునేందుకు మరోసారి పరీక్ష రాయడమేంటని ప్రశ్నిస్తున్నారు.