Share News

Kaleshwaram project: కాళేశ్వరం బ్యారేజీల పున రుద్ధరణకు రెండురోజుల్లో టెండర్‌ నోటిఫికేషన్‌

ABN , Publish Date - Sep 25 , 2025 | 05:18 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన డిజైన్లు తయారు చేయడానికి అంతర్జాతీయ స్థాయి...

Kaleshwaram project: కాళేశ్వరం బ్యారేజీల పున రుద్ధరణకు రెండురోజుల్లో టెండర్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన డిజైన్లు తయారు చేయడానికి అంతర్జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) కోరుతూ నోటిఫికేషన్‌ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ కోసం ఈవోఐ పిలవడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ఈనెల 19న నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఆ తర్వాత రెండువారాల్లోగా డిజైన్‌ కన్సల్టెంట్‌ను ఎంపిక చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఆదేశాలు ఇచ్చారు. దాంతో అత్యంత నైపుణ్యం కలిగిన సంస్థను కన్సల్టెంట్‌గా ఎంపిక చేయడానికి ఏయే అంశాలు ప్రామాణికంగా తీసుకోవాలనే అంశంపై నీటిపారుదలశాఖ కసరత్తును చేస్తోంది. రెండురోజుల్లోగా టెండర్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశాలున్నాయి.

Updated Date - Sep 25 , 2025 | 05:18 AM