kumaram bheem asifabad- సన్నరకం వరి సాగుకు మొగ్గు
ABN , Publish Date - Sep 09 , 2025 | 10:07 PM
వానాకాలంలో రైతులు సన్న వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం క్వింటాలు ధాన్యానికి రూ. 500 బోనస్ అంది స్తుండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. అధికారుల అంచనాల ప్రకారం జిల్లాలో 53,512 ఎకరాల్లో అన్నదా తలు సన్న రకం వరి సాగు చేస్తున్నారు. గతానికి భిన్నంగా రైతులు వరి సాగులో దొడ్డు రకాల వైపు విముఖత చూపుతూ వ్యయ ప్రయాసాల కోర్చి సన్న రకాలకే మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు భరోసాలో భాగంగా సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తోంది. ఈ వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు సైతం బోనస్ వర్తించ నుండడంతో సన్న రకాల సాగు విస్తీర్ణం పెరిగింది.
కౌటాల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో రైతులు సన్న వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం క్వింటాలు ధాన్యానికి రూ. 500 బోనస్ అంది స్తుండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. అధికారుల అంచనాల ప్రకారం జిల్లాలో 53,512 ఎకరాల్లో అన్నదా తలు సన్న రకం వరి సాగు చేస్తున్నారు. గతానికి భిన్నంగా రైతులు వరి సాగులో దొడ్డు రకాల వైపు విముఖత చూపుతూ వ్యయ ప్రయాసాల కోర్చి సన్న రకాలకే మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు భరోసాలో భాగంగా సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తోంది. ఈ వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు సైతం బోనస్ వర్తించ నుండడంతో సన్న రకాల సాగు విస్తీర్ణం పెరిగింది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో రైతులు సన్నాలకే సై అంటున్నారు. మండలంలో ప్రధానంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రకాలై ఎంటీయూ, జేజేఎల్, హెచ్‌ఎంటీ, సోనా, తెలంగాణ సోనా తదితర పంటలను సాగు చేసు ్తన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ సన్న బియ్యం వండి పెడుతున్న నేపథ్యంలో ఈ సీజన్‌లో సన్న రకాల వరి సాగు పెరగడంతో రాష్ట్రంలో సన్న బియ్యం కొరత తీరనుందని ప్రభుత్వం భావిస్తోంది.
- బహిరంగ మార్కెట్‌లో..
ఈ ఏడాది బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు గతేడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. ధాన్యానికి రూ.2200 నుంచి రూ.2500 ధర పలకగా స్న రకం పాత బియ్యం క్వింటాలుకు రూ.4 నుంచి 5 వేల ధర పలుకుతోంది. కొన్ని దొడ్డు రకాల వడ్లకు మార్కెటిం గ్‌లో ఇబ్బందులు తలెత్తడం, సన్న రకాల వడ్లు, బియ్యం విక్రయాలకు ఇబ్బంది ఉండదనే ఆలోచనతో రైతులు సన్నాల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ధా న్యం కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా ప్రైవేటు వ్యాపారులకు విక్రయించే అవకాశం ఉంటుందని రైతులు ఆలోచిస్తున్నారు. వడ్లకు మిల్లుల్లో పట్టించి బియ్యం సైతం విక్రయించవచ్చని అభిప్రాయంతో ఉన్నారు. బోర్లు, బావుల, చెరువుల కింద దాదాపు వరి నాట్లు పూర్తయ్యాయి.
- ప్రోత్సాహంతో ముందుకు..
ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు సన్నాల సాగుకు ముందుకు సాగుతున్నారు. వానాకాలం సీజన్‌లో సాధారణంగా సాగు విస్తీర్ణం 40 నుంచి 50 శాతం మధ్య సన్నరకాల వరి చేస్తారు. దొడ్డు వడ్ల వెరైటీలతో పోలిస్తే సన్న రకం వరి సాగుకు పెట్టుబడి అధికమ వుతోంది. సన్న రకాలకు తెగుళ్లు, చీడపీడల బాధ ఎక్కువగా ఉంటుంది. నివారణ, నియంత్రణ కోసం పురుగుల మందులు స్ర్పే చేయాల్సి ఉంటుంది. దొడ్డు రకం వరి దిగు బడితో పోలిస్తే సన్న రకాలు తక్కువ దిగుబడినిస్తాయి. అయినప్పటికీ సన్న వడ్లకు క్వింటా లుకు రూ.500 బోనస్ వస్తుండడంతో రైతులు సన్నాల సాగు వైపు అడుగేశారు.