Share News

పది ప్రశ్నపత్రం తారుమారు

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:35 PM

మంచి ర్యాల పట్టణంలో బాలుర పాఠశాలలో పదో తరగతి పరీక్షలో గందరగోళం నెలకొంది. విద్యార్థులకు శుక్రవా రం తెలుగు పరీక్ష నిర్వహించాల్సి ఉండగా దానికి బదులు హిందీ పేపర్‌కు సంబంధించిన బెండల్‌రా వడంతో సంబంధిత అధికారులు అలర్ట్‌ అయ్యారు.

పది ప్రశ్నపత్రం తారుమారు

ఒకదానికి బదులు మరొకటి అందజేత

రెండు గంటలు ఆలస్యంగా పరీక్ష

విద్యార్థులకు అదనపు సమయం కేటాయింపు

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సీరియస్‌

ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌

మంచిర్యాల క్రైం, మార్చి21(ఆంధ్రజ్యోతి): మంచి ర్యాల పట్టణంలో బాలుర పాఠశాలలో పదో తరగతి పరీక్షలో గందరగోళం నెలకొంది. విద్యార్థులకు శుక్రవా రం తెలుగు పరీక్ష నిర్వహించాల్సి ఉండగా దానికి బదులు హిందీ పేపర్‌కు సంబంధించిన బెండల్‌రా వడంతో సంబంధిత అధికారులు అలర్ట్‌ అయ్యారు. ఒక్కో సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్న పత్రాన్ని ఒక్కో ట్రంకు పెట్టెలో ఉంచి వాటిని పోలీసు స్టేషన్‌లో భద్ర పరుస్తున్నారు. బాలుర పాఠశాలకు రావాల్సిన ట్రంకు పెట్టెలో తెలుగు ప్రశ్నాపత్రం బెండల్స్‌ బదులు రెం డవ రోజు జరగాల్సిన హిందీ ప్రశ్నాపత్రం వచ్చింది. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పరీక్షా కేంద్రానికి చేరుకుని ఎస్సెస్సీ బోర్డు అధికారులకు స మాచారం అందించారు. తారుమారైన ప్రశ్నాపత్రాల బెండిల్‌ను సరి చేసేందుకు ఉన్నతాధికారుల అనుమ తితో పోలీసు స్టేషన్‌లో ఉంచిన ట్రంకు పెట్టెను సీల్‌ తీసి ఈరోజు జరగాల్సిన తెలుగు ప్రశ్నాపత్రం బెండ ల్‌ను సెంటర్‌లో ఉన్న విద్యార్థులకు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకు సుమారు గంటన్నర సమయం పట్టింది. దీనితో ఉన్నతాధికారుల సూచన మేరకు రెండు గంటల అలస్యంగా పరీక్షను ప్రారం భించారు. 11.30 నిమిషాల నుంచి 2.30 గంటల వ రకు సమయాన్ని కేటాయించారు. విద్యార్థులకు స్నా క్స్‌తో పాటు తాగునీటిని అందించారు. ఈ పరీక్షా కేంద్రంలో సుమారు8 200 మంది విద్యార్థులు పరీక్ష లకు హాజరయ్యారు.

నిర్లక్ష్యం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం వహించిన పరీక్ష ముఖ్య పర్యవేక్షకులు మీర్‌ సత్తార్‌ అలీఖాన్‌, శాఖ అధికారి ఎన్‌ఆర్‌ పద్మలను సస్పెండ్‌ చేసినట్లు వారి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తె లిపారు. ప్రశ్న పత్రాల బండిల్స్‌ తారు మారు అయి నప్పటికీ ప్రభుత్వ సీల్‌తో పోలీసు స్టేషన్‌లో అలాగే భద్ర పరిచి ఉందన్నారు.

రెండు గంటలు ఆలస్యంగా ఇచ్చారు...

బండారి గీతిక, విద్యార్థిని

పరీక్ష సమయంలో విద్యార్థులకు 9.30గంటలకు ప్రశ్నాపత్రం ఇవ్వాల్సి ఉండగా 2గంటలు ఆలస్యంగా ఇచ్చారు. కొంత ఆందోళనకు గురయ్యాను. అధికారు లు వచ్చి పేపర్‌ తారుమారు అయింది. అదనంగా 3 గంటల సమయాన్ని అందిస్తాము. పరీక్షలు ప్రశాం తంగా రాయాలని సూచించారు.

Updated Date - Mar 21 , 2025 | 11:35 PM