kumaram bheem asifabad- పది లక్ష్యం..వంద శాతం..
ABN , Publish Date - Oct 17 , 2025 | 10:20 PM
పదో తరగతి ఫలితాల్లో వరుసగా మూడేళ్లు చివరి మూడు స్థానాలకు పరిమితమైన జిల్లాను మెరుగుప రిచేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణతో సిద్ధమైంది. శతశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పది రోజులుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులు జనవరి 9వరకు కొనసాగనున్నాయి.
- ఇప్పటికే మొదలైన ప్రత్యేక తరగతులు
- విద్యార్థుల అభ్యాసన మెరుగునకు వారాంతపు పరీక్షలు
- జిల్లాలో 77 ఉన్నత పాఠశాలలు, 3,598 మంది విద్యార్థులు
పదో తరగతి ఫలితాల్లో వరుసగా మూడేళ్లు చివరి మూడు స్థానాలకు పరిమితమైన జిల్లాను మెరుగుప రిచేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణతో సిద్ధమైంది. శతశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పది రోజులుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులు జనవరి 9వరకు కొనసాగనున్నాయి.
చింతలమానేపల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత శాతం సాధించే దిశగా విద్యాశాఖ ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా వెనుకబడిన విద్యార్థులు వారి ర్యాంకులను మెరుగుపర్చుకోవడం కోసం చర్యలు చేపట్టింది. ఈ నెల 8 నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశా లలు మొత్తం 77 ఉన్నాయి. విద్యార్థులు 3,598 మంది పదో తరగతి చదువుతు న్నారు.
- అభ్యాస దీపికలు..
ప్రత్యేక తరగతులతో పాటు అభ్యాస దీపికల తయారీ బోధకులతో టెలీ కాన్ఫరెన్స్, వెబ్ కాన్ఫరెన్స్ విద్యార్థుల దత్తత, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలు తీసుకోనున్నారు. ఈ సారి మరింత పకడ్భందీగా కార్యాచరణ రూపొందించారు. ఎప్పుడూ లేని విధం గా అదనపు కలెక్టర్ దీపక్ తివారీకి ఇన్‌చార్జి డీఈవో గా బాధ్యతలు అప్పగించారు. దీంతో విద్యావ్యవస్థ పట్ల కింది స్థాయి అధికారులు సైతం పకడ్భందీగా పని చేసేందుకు అవకాశం ఉంది. దీంతో జిల్లాలోని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వ హించి జిల్లాలో ఉన్నత ఫలితాలు రాబట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. పకడ్భందీగా ఈ కార్యాచర్యణను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రోజూ సాయంత్రం 4.15 గంటల నుండి 5.15 గంటల వరకు అదనంగా గంట పాటు రోజుకె సబ్జెక్టు చొప్పున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వచ్చే జనవరి 9 వరకు ఈ ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. ఆ లోగా సిలబస్ పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఒక్కో పాఠ్యాంశంపై..
ప్రతీ వారం ఒక్కో పాఠ్యాంశంపై పరీక్షలు నిర్వహిం చి ప్రతిభను అంచన వేసి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద తీసుకోనున్నారు. జనవరి 10వ తేది వరకు యతాఽథతంగా 4.15 గంటల నుండి 5.15 వరకు కొనసాగుతాయి. ప్రత్యేక తరగతుల్లో భాగంగా ఏ రోజుఏ సబ్జెక్టు భోధించాలన్న విషయంలో స్పష్ట మైన షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు ఇచ్చారు. పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ఉద్దేశ్యంతో ఎంసీఈఆర్‌టీ రూపొందించిన వాటితో పాటు భాష నిపుణు లతో తయారు చేయించిన అభ్యాస దీపికలతో విద్యార్థులను సన్నద్ధం చేయనున్నారు. ప్రతీ పాఠశాలలో వారానికి ఒకసారి ప్రత్యేక తరగతులపై సమీక్ష జరుగుతోంది. ప్రతీ సబ్జెక్టులో ఆయా పాఠ్యాంశాలపై వారాంతంలో విద్యార్థులకు క్విజ్ టెస్టులు నిర్వహిస్తారు. గణితం, ఇంగ్లీష్. సైన్స్ వంటి సబ్జెక్టుల్లో విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు ఉపాధ్యాయులంతా కలిసి కట్టుగా పని చేస్తారు.
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం..
- జయరాజు, చింతలమానేపల్లి ఎంఈవో
పది పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుంచేప్రత్యేక తరగతులు కార్యాచరణను అమలు చేస్తున్నాం. ఈ నెల 8 నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభించాం. చదువులో వెనుక బడిన విద్యార్థులకు సకాలంలో సిలబస్ పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.