దుందుభీలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలి
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:45 PM
కల్వకుర్తి వైపు వెళ్లే ప్రధాన రహదారి దుందుభీ నదిలో ఉన్న లోలెవల్ కాజ్‌వే పూ ర్తిగా దెబ్బతిన్నందున వెంటనే తా త్కాలిక మరమ్మతులు చేపట్టి రా కపోకలు కొసాగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి పంచాయతీరాజ్ ఏఈ గోవిందును ఆదేశించారు.
- పంచాయతీరాజ్ ఏఈ గోవిందును ఆదేశించిన ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి
తాడూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి వైపు వెళ్లే ప్రధాన రహదారి దుందుభీ నదిలో ఉన్న లోలెవల్ కాజ్‌వే పూ ర్తిగా దెబ్బతిన్నందున వెంటనే తా త్కాలిక మరమ్మతులు చేపట్టి రా కపోకలు కొసాగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి పంచాయతీరాజ్ ఏఈ గోవిందును ఆదేశించారు. బుధవా రం సిర్సవాడలోని దుందుభీ నది వద్ద దెబ్బతి న్న లోలెవల్ కాజ్‌వేను క్షేత్రస్థాయిలో పరిశీలిం చారు. ఎమ్మెల్యే నిధుల నుంచి ఖర్చు చేయా లని సూచించారు. కార్యక్రమంలో సింగిల్ విం డో చైర్మన్ రామచంద్రారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద్‌కుమార్, నాగర్ కర్నూల్ మార్కెట్ చైర్మన్ రమణారావు పాల్గొన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్ర భుత్వం కట్టుబడి ఉందని నాగర్‌కర్నూల్ ఎమ్మె ల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. తాడూరు మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని నెల్లికుదురు గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో బుధవారం వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలన
నాగర్‌కర్నూల్ టౌన్ (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని బస్ డిపో సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్ నాగిరెడ్డితో కలిసి పరిశీలించారు. వీలైనంత త్వరగా పను లు పూర్తి చేయాలని ఆదేశించారు. మాజీ కౌన్సి లర్లు కొత్త శ్రీనివాసులు, నిజాముద్దీన్, మునిసి పల్, అధికారులు పాల్గొన్నారు.