Shailaja Ramaiyar: ఆలయ ఆదాయాన్ని బట్టి సిబ్బంది ఉండాలి
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:09 AM
చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అర్చక, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్‌కు అర్చక, ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా...
కమిషనర్‌కు అర్చక, ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి
హైదరాబాద్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అర్చక, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్‌కు అర్చక, ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది. నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శైలజా రామయ్యర్‌ను జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణమాచారి తదితరులు బుధవారం కలిశారు. ఆలయ ఆదాయాన్ని బట్టి సిబ్బంది సంఖ్యపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు.