Telugu poet Perugu Ramakrishna: పెరుగు రామకృష్ణకు సార్క్ సాహిత్య పురస్కారం ప్రదానం
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:28 AM
తెలుగు కవి పెరుగు రామకృష్ణకు సార్క్ సాహిత్య పురస్కారం లభించింది. 66వ సార్క్ సాహిత్య సదస్సు ఆదివారం న్యూఢిల్లీలో ఫౌండేషన్ ఆఫ్ సార్క్...
న్యూఢిల్లీ, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): తెలుగు కవి పెరుగు రామకృష్ణకు సార్క్ సాహిత్య పురస్కారం లభించింది. 66వ సార్క్ సాహిత్య సదస్సు ఆదివారం న్యూఢిల్లీలో ఫౌండేషన్ ఆఫ్ సార్క్ రైటర్స్ అండ్ లీటరేచర్ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. మూడురోజుల పాటు జరిగే సదస్సులో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. సార్క్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రొఫెసర్ ఆశిస్ నందితోపాటు సాహిత్య అకాడెమీ అధ్యక్షులు మాధవ్ కౌశిక్ అందుకున్నారు. అలాగే పెరుగు రామకృష్ణకు సార్క్ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం పెరుగు రామకృష్ణ తాజాగా రచించిన ఆంగ్ల కవిత్వం ‘‘ఈచెస్ ఆఫ్ నెల్లూర్’’ పుస్తకాన్ని మాధవ్ కౌశిక్ సభకు పరిచయం చేశారు.