Union Minister Scindia: తెలంగాణ టీ ఫైబర్ గ్రామాలు దేశానికే ఆదర్శం
ABN , Publish Date - Oct 09 , 2025 | 04:55 AM
టీ ఫైబర్ గ్రామాలు దేశానికే ఆదర్శమని కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొనియాడారు....
ఇండియా మొబైల్ కాంగ్రె్‌సలో కేంద్ర మంత్రి సింధియా
గ్రామాలు, పట్టణాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించడమే లక్ష్యం: మంత్రి దుద్దిళ్ల
న్యూఢిల్లీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): టీ-ఫైబర్ గ్రామాలు దేశానికే ఆదర్శమని కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొనియాడారు. టీ-ఫైబర్ మోడల్‌కు సంబంధించి లాస్ట్‌మైల్ బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ’ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025‘ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో సింధియా అధ్యక్షతన ఐటీ మంత్రుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కో ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణలో భారత్ నెట్‌ను మరింత వేగవంతంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ స్థాయిలో ప్రతీ ఇంటికి ఫైబర్ నెట్‌వర్కును తీసుకెళ్లడంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైందన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రజలకు ఈ గవర్నెన్స్, విద్య, వైద్యం, డిజిటల్ సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించాలన్నదే తమ ప్రభుత్వ సంక ల్పమన్నారు.