Share News

IAS Officers Transfers: నలుగురు ఐఏఎస్‌ల బదిలీ

ABN , Publish Date - Dec 31 , 2025 | 04:53 AM

రాష్ట్రంలోని నలుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ, ఇద్దరు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

IAS Officers Transfers: నలుగురు ఐఏఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నలుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ, ఇద్దరు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా ఉన్న జి. సృజనను బదిలీ చేసి, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా నియమించింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ జోన్ల బాధ్యతలను ఆమె పర్యవేక్షించనున్నారు. నిజామాబాద్‌ కలెక్టర్‌ టి. వినయ్‌ కృష్ణా రెడ్డి బదిలీ అయ్యి, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌(మల్కాజిగిరి, ఎల్బీ నగర్‌, ఉప్పల్‌ జోన్లు)గా వ్యవహరించనున్నారు. నల్లగొండ కలెక్టర్‌గా ఉన్న ఇలా త్రిపాఠిని నిజామాబాద్‌ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ బడుగు చంద్రశేఖర్‌ను పదోన్నతిపై నల్లగొండ కలెక్టర్‌గా కొనసాగుతారని వెల్లడించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా పని చేస్తున్న శృతి ఓఝాకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌కు నారాయణపేట్‌ అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు)గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

Updated Date - Dec 31 , 2025 | 04:53 AM