Share News

Minister Tummala Nageswara Rao: 2047 నాటికి సాగు తీరు మారుస్తాం

ABN , Publish Date - Dec 30 , 2025 | 05:52 AM

రాష్ట్రంలో 2047 నాటికి 4 వేల గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయం, 39.5 లక్షల ఎకరాలకు స్మార్ట్‌ మైక్రో ఇరిగేషన్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Minister Tummala Nageswara Rao: 2047 నాటికి సాగు తీరు మారుస్తాం

  • దాదాపు 4 వేల గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయం

  • దేశ సహకార రంగంలో మార్గదర్శిగా తెలంగాణ:తుమ్మల

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2047 నాటికి 4 వేల గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయం, 39.5 లక్షల ఎకరాలకు స్మార్ట్‌ మైక్రో ఇరిగేషన్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అంతర్జాతీయ సహకార వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన సహకార సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలతోనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, దేశ సహకార రంగానికి తెలంగాణ మార్గదర్శిగా నిలుస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా రుణాల రికవరీలో 100 శాతం పురోగతి సాధించిన రాష్ట్రంలోని 11 ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘాలకు మంత్రి తుమ్మల అవార్డులు పంపిణీ చేశారు.

Updated Date - Dec 30 , 2025 | 05:52 AM