Union Minister G. Kishan Reddy: వికసిత్ భారత్ 2047లో తెలంగాణదే కీలకపాత్ర
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:56 AM
వికసిత్ భారత్ 2047లో తెలంగాణ కీలక పాత్ర పోషించనుంది. తెలంగాణ ఎదుగుదలను ప్రపంచానికి చాటి చెప్పే వేదికగా గ్లోబల్ సమ్మిట్ నిలుస్తోంది. ప్రధానిగా...
‘వికసిత్ భారత్-2047’లో తెలంగాణ కీలక పాత్ర పోషించనుంది. తెలంగాణ ఎదుగుదలను ప్రపంచానికి చాటి చెప్పే వేదికగా గ్లోబల్ సమ్మిట్ నిలుస్తోంది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత శక్తిమంతమైన దేశంగా భారత్ అవతరించింది. హైదరాబాద్ కేవలం తెలంగాణ రాజధాని మాత్రమే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఓ మూలస్తంభం లాంటిది. ఐటీ హబ్‌గా, ఇన్నొవేషన్ కారిడార్‌గా, ఫార్మాసూటికల్ క్యాపిటల్‌గా, ఏరోస్పేస్ టెక్నాలజీ సెంటర్‌గా పురోగమిస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని మరింత పెంచేందుకు అందరం కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి 2025 వరకు దేశానికి 748.78 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు దశాబ్దంతో పోలిస్తే 143 శాతం వృద్ధి నమోదైంది. గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ కు మధ్య వారధిగా, భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. గత పదేళ్లలో తెలంగాణకు గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిక పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల రూపంలో 10లక్షల కోట్లకుపైగా నిధులు అందాయి.
- కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి