Share News

Telangana as a strategic Defense hub.: హైదరాబాద్‌లో మిలటరీ డ్రోన్ల తయారీ

ABN , Publish Date - Dec 03 , 2025 | 04:10 AM

జేఎ్‌సడబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన జేఎ్‌సడబ్ల్యూ డిఫెన్స్‌ సంస్థ.. హైదరాబాద్‌లో మిలిటరీ డ్రోన్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. అమెరికా సంస్థ షీల్డ్‌ ఏఐతో కలిసి....

Telangana as a strategic Defense hub.: హైదరాబాద్‌లో మిలటరీ డ్రోన్ల తయారీ

  • 800కోట్ల వ్యయంతో జేఎ్‌సడబ్ల్యూ ప్లాంట్‌.. వచ్చే ఏడాది నవంబరు నాటి కల్లాసిద్ధం చేస్తాం

  • ఏటా 300 వీ-బీఏటీ డ్రోన్ల తయారీ

  • శంకుస్థాపనకార్యక్రమంలో పార్థజిందాల్‌

  • డిఫెన్స్‌ హబ్‌గా తెలంగాణ: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినె్‌స)/హైదరాబాద్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జేఎ్‌సడబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన జేఎ్‌సడబ్ల్యూ డిఫెన్స్‌ సంస్థ.. హైదరాబాద్‌లో మిలిటరీ డ్రోన్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. అమెరికా సంస్థ షీల్డ్‌ ఏఐతో కలిసి అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ సిస్టమ్స్‌ (యూఏఎస్‌) ప్లాంట్‌ను నెలకొల్పుతున్నట్లు జేఎ్‌సడబ్ల్యూ డిఫెన్స్‌ వ్యవస్థాపకుడు పార్థ జిందాల్‌ వెల్లడించారు. మహేశ్వరంలోని ఎలకా్ట్రనిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుతో కలిసి ప్లాంట్‌ నిర్మాణానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 16 ఎకరాల విస్తీర్ణంలో రూ.800 కోట్ల (9 కోట్ల డాలర్లు) పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే తొలి వర్టికల్‌ టేకా్‌ఫ-ల్యాండింగ్‌ (వీటీఓఎల్‌), గ్రూప్‌ 3 యూఏఎస్‌ వీ-బీఏటీ డ్రోన్ల తయారీ కోసం అమెరికా సంస్థ షీల్డ్‌ ఏఐతో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. భారత సైన్యం అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల కోసం అవసరమైన మానవ రహిత డ్రోన్లను ఈ ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నవంబరు నాటికల్లా ఈ అడ్వాన్స్‌డ్‌ మిలిటరీ డ్రోన్‌ ప్లాంట్‌ అందుబాటులోకి రానుందని, ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 300 వీ-బీఏటీ డ్రోన్స్‌ అని ఆయన చెప్పారు. జెట్‌ ఇంధనంతో నడిచే ఈ డ్రోన్‌ 70 కిలోల పేలోడ్‌తో ఏకధాటిగా 12 గంటలు ప్రయాణిస్తుందన్నారు. ఈ ప్లాంట్‌ ద్వారా ప్రతక్ష్యంగా 300 మందికి, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని వెల్లడించారు. ఇప్పటికే టెక్నాలజీ కొనుగోలు, శిక్షణ, ఐదు వీ-బీఏటీ డ్రోన్ల దిగుమతి కోసం రూ.320 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. కాగా, ‘డిఫెన్స్‌ స్ట్రాటజిక్‌ హబ్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడించారు. అడ్వాన్స్‌డ్‌ అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ సిస్టమ్స్‌, డిఫెన్స్‌ ఇన్నోవేషన్‌లో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు దశలవారీగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. డ్రోన్‌ తయారీ, టెస్టింగ్‌ కారిడార్‌ ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో దేశీయ, అంతర్జాతీయ రక్షణ దిగ్గజ సంస్థలు ఉండటం మరింత కలిసిరానుందన్నారు. 2030 నాటికి భారత రక్షణ యూఏవీ, డ్రోన్‌ మార్కెట్‌ విలువ 500 కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉందని, దీన్ని అవకాశంగా మలుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

Updated Date - Dec 03 , 2025 | 04:10 AM