Minister Tummala Nageswara Rao: ఏకగ్రీవం అయిన పంచాయతీలకు 10 లక్షల చొప్పున ప్రోత్సాహకం
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:08 AM
రానున్న గ్రామ పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలను ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం ద్వారా పల్లెలు సజావుగా...
ఏకగ్రీవ ఎన్నికల ద్వారా పల్లెల అభివృద్ధి
ఏడాదిన్నరలో చేనేత రంగానికి వెయ్యి కోట్లు: తుమ్మల
రఘునాథపాలెం/హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘‘రానున్న గ్రామ పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలను ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం ద్వారా పల్లెలు సజావుగా అభివృద్ధి చెందుతాయి. ఏకగ్రీవం అయిన గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది’’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెంలో 33కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని చేనేత భవన్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ) ప్రయోగశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి వెయ్యి కోట్లు కేటాయించిందని తెలిపారు. కోటి మంది మహిళలకు ఇందిరా మహిళాశక్తి చీరెలు పంపిణీ చేయటంతో చేనేత రంగానికి చేయూత లభించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెంకటగిరిలో మా త్రమే ఐఐహెచ్‌టీ ఉండేదని, సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఒప్పించి ఐఐహెచ్‌టీని తెలంగాణకు మంజూరు చేయించారని తెలిపారు. దీనికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టినట్లు చెప్పారు.