Tummala Nageswara Rao: కూరగాయల సాగు విస్తీర్ణం పెరగాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:01 AM
కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయని, తెలంగాణకు అవసరమైన కూరగాయలను రాష్ట్రంలోనే పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని సంబధిత అధికారులకు వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి తుమ్మల
అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయని, తెలంగాణకు అవసరమైన కూరగాయలను రాష్ట్రంలోనే పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని సంబధిత అధికారులకు వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కూరగాయల సాగు ప్రణాళిక సిద్ధం చేసి, డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులకు జిల్లాలు కేటాయించి, కలెక్టర్లు, అధికారులతో సమన్వయం చేసుకొని, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.
మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్‌లలో పెదఎత్తున కూరగాయల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి పామాయిల్ సాగు లక్ష్యాన్ని పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్‌భాషా ఈ సమీక్షలో పాల్గొన్నారు.