Share News

Medical Education: వైద్య పరిషత్‌ ఆస్పత్రుల్లో 50 పీజీ సీట్లు

ABN , Publish Date - Sep 30 , 2025 | 04:20 AM

తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ (టీవీవీపీ) పరిఽధిలోని ఆరు ప్రాంతీయ ఆస్పత్రుల్లో కొత్తగా మొత్తం 50 పీజీ సీట్లతో ప్రత్యేక కళాశాలల...

Medical Education: వైద్య పరిషత్‌ ఆస్పత్రుల్లో 50 పీజీ సీట్లు

  • ప్రత్యేక కాలేజీలుగా ఏర్పాటు.. 6 ప్రాంతీయ ఆస్పత్రుల ఎంపిక

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ (టీవీవీపీ) పరిఽధిలోని ఆరు ప్రాంతీయ ఆస్పత్రుల్లో కొత్తగా మొత్తం 50 పీజీ సీట్లతో ప్రత్యేక కళాశాలల(స్టాండ్‌ ఎలోన్‌ కాలేజీ)ను ఏర్పాటు చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. 2026 విద్యా సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు సోమవారం వైద్య ఆరోగ్య కార్యదర్శి క్ట్రిస్టినా జడ్‌ చోంగ్థు టీవీవీపీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రత్యేక కాలేజీలకు అదనపు అధ్యాపక సిబ్బందిని మంజూరు చేయాలని ఇప్పటికే టీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ 50 పీజీ సీట్ల కోసం 25 మంది ప్రొఫెసర్లు, మరో 25 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఇంకో 25 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అవసరమవుతారని లేఖలో పేర్కొన్నారు. ఈ 50 పీజీ సీట్లలో 6 గైనకాలజీ, 6 పిడియాట్రిక్స్‌, 6 జనరల్‌ మెడిసిన్‌, 12 జనరల్‌ సర్జరీ, 4 ఈఎన్‌టీ, 8 ఆర్థోపెడిక్‌, 2 రేడియాలజీ, 4 ఆప్తమాలజీ, 2 పాథాలజీ ఉన్నాయి. ఈ పీజీ సీట్ల కోసం జాతీయ వైద్య కమిషన్‌కు త్వరలోనే దరఖాస్తు చేయనున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Sep 30 , 2025 | 04:20 AM