kumaram bheem asifabad- కాంగ్రెస్ చెర నుంచి తెలంగాణ తల్లిని విడిపించాలి
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:13 PM
కాంగ్రెస్, బీజేపీ కూటమిల దోపిడీ పెత్తందార్ల కబందహస్తాల నుంచి తెలంగాణ తల్లిని విడిపించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. దీక్షా దివాస్ భాగంగా జిలాల్లో కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి ముఖ్య అతిథిగా ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు.
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీజేపీ కూటమిల దోపిడీ పెత్తందార్ల కబందహస్తాల నుంచి తెలంగాణ తల్లిని విడిపించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. దీక్షా దివాస్ భాగంగా జిలాల్లో కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి ముఖ్య అతిథిగా ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల ఇసుక దందా కోసం 2023లో మేడిగడ్డ బ్యారేజ్ బాబులు పెట్టి పేల్చడానికి ప్రయత్నం చేశారని అన్నారు. ఈ క్రమంలో పిల్లర్ కుంగిందని చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గం తనకుల వద్ద కూడా చెక్ డ్యాం పేల్చారని ఆరోపించారు. మేడిగడ్డ మరమ్మతులు లేక లక్ష మంది రైతులు ఇబ్బందులు పడుతుండగా తనకులతో వెయ్యి మంది రైతులు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన పూర్తి అధ్వానంగా ఉందని అన్నారు. ఎంతో పోరాటం చేసి కేసీఆర్ తీసుకు వచ్చిన తెలంగాణలో తొమ్మిదేళ్ల కాలంలో మెడికల్ కళాశాలలు, వేయి గురుకులాలు, కొత్త జిల్లాలు, పేద విద్యార్థులకు హైదరాబాద్‌లో నాలుగు ప్రతిభ పాఠశాలు ఏర్పాటు చేశారని అన్నారు. దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ నంబర్‌వనగా నిలిచిందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 115 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అలీబీన్ అహ్మద్, రవీందర్, సరస్వతీ, పోచయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్, సంజీవ్, నిసార్, జీవన్, బాపురావు, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.