Renewable Energy: క్లీన్, గ్రీన్ ఎనర్జీ కోసం రెండు నోడల్ ఏజెన్సీలు
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:18 AM
తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 అమలు కోసం రాష్ట్రంలో రెండు నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
జెన్‌కో, రెడ్‌కోలను నియమిస్తూ సర్కారు ఉత్తర్వు
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025 అమలు కోసం రాష్ట్రంలో రెండు నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్ జీవో 40 జారీ చేశారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, మినీ అండ్ మైక్రో హైడల్, జియో థర్మల్, పాత రెన్యూవబుల్ ప్రాజెక్టులతో కలిపి స్టోరేజ్ కేంద్రాలు పెట్టాలంటే తెలంగాణ జెన్‌కో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఇక సోలార్, పవన, బయోమాస్, బయోగ్యాస్, చెరకు పిప్పి, బయో ఫ్యూయల్స్, ఆర్‌ఈ హైబ్రిడ్(సోలార్, పవన, ఫ్లోటింగ్ సోలార్), ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలు/బ్యాటరీ మార్పిడి సౌకర్యాలు, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రాజెక్టులకు తెలంగాణ రెడ్‌కో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఆయా ప్రాజెక్టుల కోసం నోడల్ ఏజెన్సీలను సంప్రదించాల్సి ఉంటుంది.