Share News

Minister Sridhar Babu: తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పటిష్ఠమైన వృద్ధి

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:37 AM

తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ రంగం పటిష్ఠమైన వృద్ధితో ముందుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు వ్యాఖ్యానించారు. లైఫ్‌సైన్సెస్‌ రంగంలో...

Minister Sridhar Babu: తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పటిష్ఠమైన వృద్ధి

  • థర్మోఫిషర్‌ సైంటిఫిక్‌ డిజైన్‌ సెంటర్ల ప్రారంభం

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ రంగం పటిష్ఠమైన వృద్ధితో ముందుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు వ్యాఖ్యానించారు. లైఫ్‌సైన్సెస్‌ రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ థర్మోఫిషర్‌ సైంటిఫిక్‌, ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లోని జినోమ్‌ వ్యాలీలో ఏర్పాటు చేసిన రెండు బయోప్రాసెస్‌ డిజైన్‌ సెంటర్ల ప్రారంభోత్సవానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2030 నాటికి లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు సాధించాలన్న తమ లక్ష్య సాధనకు ఇలాంటి భాగస్వామ్యాలు తోడ్పడతాయాన్నారు. తెలంగాణను ప్రపంచ లైఫ్‌ సైన్సెస్‌ రాజధానిగా నిలపాలన్న తమ విజన్‌కు తోడ్పడుతూ నైపుణ్యాల శిక్షణ అవకాశాలను కల్పించేందుకు ఈ కొత్త కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. థర్మోఫిషర్‌ సైంటిఫిక్‌ సంస్థ ఆసియా పసిఫిక్‌ ప్రెసిడెంట్‌ టోనీ యాక్సియారిటో మాట్లాడుతూ.. భారత లైఫ్‌ సైన్సెస్‌ రంగం కీలక దశలో ఉందని, పరిశోధకులు, పరిశ్రమ భాగస్వాములు తమ ఆలోచనలను వేగవంతంగా ఆచరణలోకి తేవడంలో ఈ కొత్త సెంటర్లు తోడ్పడుతాయని అన్నారు. ఆ సంస్థ భారత, దక్షిణాసియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనాథ్‌ వెంకటేశ్‌ మాట్లాడుతూ.. ప్రతిభావంతులు, మౌలిక సదుపాయాలు, అధునాతన టెక్నాలజీని మేళవించి, అంతర్జాతీయ బయోఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో భారత్‌ స్థానాన్ని పటిష్ఠం చేేస విధమైన సుస్థిర వ్యవస్థ ఏర్పాటుకు తోడ్పాటునిచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. దేశీయంగా ఆవిష్కరణలు, అభివృద్ధి, తయారీకి సంబంధించి విశ్వసనీయమైన భాగస్వామిగా నిలవాలన్న మా విజన్‌కు ఈ సెంటర్ల విస్తరణ నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 04:37 AM