Krishna Tribunal: ఆ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చే యండి
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:15 AM
శ్రీశైలం, జూరాల, నాగార్జునసాగర్, ఆకేరువాగు కేంద్రంగా చేపట్టిన 16 ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని కృష్ణా ట్రైబ్యునల్‌ను తెలంగాణ కోరింది....
16 ప్రాజెక్టుల జీవోతో పాటు పత్రాలు.. ట్రైబ్యునల్‌కు అందించిన తెలంగాణ
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం, జూరాల, నాగార్జునసాగర్, ఆకేరువాగు కేంద్రంగా చేపట్టిన 16 ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని కృష్ణా ట్రైబ్యునల్‌ను తెలంగాణ కోరింది. కృష్ణాలో 904 టీఎంసీలను తెలంగాణకు కేటాయించేలా వాదనలు వినిపించాలని, ఆ మేరకు ప్రాజెక్టుల నిర్మాణాల కోసం అవసరమైన సమగ్ర ఇన్వెస్టిగేషన్లు, ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, డీపీఆర్‌లు సిద్ధం చేయడంపై దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం విదితమే. ఆ ఆదేశాలతో రాష్ట్రంలో 16 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం చేయడానికి వీలుగా జీవో నెం.34ను జారీ చేయగా... ఆ జీవోను బుధ వారం వాదనల సందర్భంగా ట్రైబ్యునల్‌కు అందించారు. ట్రైబ్యునల్‌లో రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరుగుతున్న విషయం విదితమే. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలతో పాటు పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు ఆ మేరకు నీటిని వినియోగించుకోవచ్చనే స్వేచ్ఛతో కేటాయించిన దానిలో 45 టీఎంసీలతో పాటు జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్ కేటాయించిన జలాలన్నీ కలుపుకొని మొత్తం 1,050 టీఎంసీలపై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. ట్రైబ్యునల్ విచారణ గురువారంతో ముగియనుంది.