Share News

Telangana Scientist Abhinav Kandal: తెలంగాణవాసికి అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డు

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:31 AM

అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణవాసి అభినవ్‌ కందాళకు ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. భౌతిక శాస్త్రం, సమాచార రంగాల్లో విశేష కృషిచేసి.....

Telangana Scientist Abhinav Kandal: తెలంగాణవాసికి అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డు

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణవాసి అభినవ్‌ కందాళకు ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. భౌతిక శాస్త్రం, సమాచార రంగాల్లో విశేష కృషిచేసిన వారికి అందించే అమెరికన్‌ ఫిజికల్‌ సొసైటీ అవార్డుకు ఈ ఏడాదికి అభినవ్‌ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో గత దశాబ్దా కాలంలో చేసిన విశేషి కృషికి గాను.. ఈ పురస్కారానికి ఎంపిక చేశామని అమెరికన్‌ ఫిజికల్‌ సొసైటీ తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన అభినవ్‌ ఐఐటీ బాంబేలో బీటెక్‌, అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తిచేశారు.

Updated Date - Dec 04 , 2025 | 04:32 AM