Share News

Revenue Minister Ponguleti Srinivas Reddy: రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, సర్వే ఒకే గొడుగు కిందకు

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:26 AM

భూ పరిపాలనా విభాగాన్ని బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలందించేందుకు గాను రెవెన్యూ;....

Revenue Minister Ponguleti Srinivas Reddy: రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, సర్వే ఒకే గొడుగు కిందకు

  • భూ పరిపాలన విభాగాన్ని బలోపేతం చేస్తాం

  • ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలందిస్తాం

  • కొత్త తహసీల్దార్‌ కార్యాలయాలన్నీ ఒకేలా ఉండాలి

  • రెవెన్యూ శాఖపై సమీక్షలో మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): భూ పరిపాలనా విభాగాన్ని బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలందించేందుకు గాను రెవెన్యూ; స్టాంపులు, రిజిస్ట్రేషన్‌, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. సోమవారమిక్కడ ఆయన రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, సర్వే విభాగాలపై సమీక్ష నిర్వహించారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వం వివిధ అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని సేకరించినా.. ఇప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో వారి పేర్లే ఉన్నాయని, వాటిని మార్చాలని అధికారులకు సూచించారు. అసైన్డ్‌, భూదాన్‌ భూములపైనా మంత్రి సమీక్షించారు. కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగులపై విజిలెన్స్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విభాగాల వారీగా ఎన్ని కేసులు పెండింగ్‌ ఉన్నాయి? అందుకు కారణాలు ఏంటనేది తెలియజేయాలని పొంగులేటి ఆదేశించారు. త్వరలోనే కోర్టు కేసులపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నిర్మించబోయే తహసీల్దార్‌ కార్యాలయాలన్నీ ఒకే నమూనాలో ఉండాలని, ఇందుకు అవసరమైన డిజైన్లు సిద్ధం చేయాలని సీసీఎల్‌ఏని ఆదేశించారు.


ఒక్క క్లిక్‌తో సమాచారమంతా తెలియాలి

ఒక్క క్లిక్‌తో రైతుల భూములకు సంబంధించిన సమగ్ర సమాచారం లభించేలా భూ భారతి పోర్టల్‌ను సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, మార్కెట్‌ విలువలు, విలేజ్‌ మ్యాప్‌లు, ప్రతి సర్వే నంబరుకు సంబంధించిన మ్యాప్‌, నాలా ఆర్డర్లు, ఆర్వోఆర్‌, గ్రామాల నక్షా, ఫీడ్‌ బ్యాక్‌ వ్యవస్థ వంటి అన్ని వివరాలు లభించేలా రిజిస్ట్రేషన్‌, సర్వే విభాగాలతో అనుసంధానం చేస్తూ పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఆధార్‌ నంబరుతో అనుసంధానమైన మొబైల్‌ నంబరుతో లాగిన్‌ అయితే వెంటనే కావాల్సిన సమాచారం దొరుకుతుందని అన్నారు. క్రయవిక్రయ దారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి సర్వే నంబరు మ్యాప్‌ను రూపొందించే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్థను ఆధునికీకరణ చేసే ప్రతి పనిలో సామాన్యుడికి మేలు జరిగేలా, లోపాలకు తావు లేకుండా పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌కుమార్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఐజీ రాజీవ్‌ గాంధీ హనుమంతు, సీసీఎల్‌ఏ కార్యదర్శి మందా మకరంద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆస్తి పన్ను వడ్డీపై 90ు రాయితీ!

చెల్లించాలి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 9.40 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్ల (పీటీఐఎన్‌) నుంచి రూ.3,930 కోట్ల పన్ను.. దానిపై రూ.7,385 కోట్ల వడ్డీ బకాయి ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం పన్ను రూ.953 కోట్లు, వడ్డీ రూ.25 కోట్లతో కలిపితే మొత్తం రూ.12,230 కోట్లకు పైగా బకాయిలున్నాయి. ఇందులో 1,800 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తుల నుంచి పన్ను, వడ్డీ కలిపి రూ.5500 కోట్లు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. ఓటీఎ్‌సతో ఈ ఆర్థిక సంవత్సరం రూ.500 కోట్లకు పైగా పన్ను వసూలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో 3 సార్లు ఓటీఎ్‌సకు అవకాశం కల్పించగా.. రూ.956 కోట్ల మేర పన్ను వసూలైంది. జీహెచ్‌ఎంసీ విస్తరణ నేపథ్యంలో విలీన మునిసిపాలిటీలకూ ఓటీఎస్‌ వర్తిస్తుందని అధికారులు అంటున్నారు.

Updated Date - Dec 23 , 2025 | 04:26 AM