Tummala Nageswara Rao: యాసంగికి ముందస్తుగా యూరియా కేటాయింపులు చేయాలి
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:05 AM
ఈ ఖరీఫ్ సీజన్‌లో యూరియా సరఫరాలో జరిగిన ఇబ్బందుల నేపథ్యంలో వచ్చే యాసంగి సీజన్‌లో ముందస్తుగా రాష్ట్రానికి యూరియా కేటాయింపులు చేయాలని..
కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
ఈ ఖరీఫ్ సీజన్‌లో యూరియా సరఫరాలో జరిగిన ఇబ్బందుల నేపథ్యంలో వచ్చే యాసంగి సీజన్‌లో ముందస్తుగా రాష్ట్రానికి యూరియా కేటాయింపులు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొదటి మూడు నెలలు రెండు లక్షల టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కోరుతూ శుక్రవారం ఆయన కేంద్రానికి లేఖ రాశారు. అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబరు నెలలో యూరియా సరఫరా మెరుగుపడింద న్నారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు రాష్ట్రానికి మొత్తం 7.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాగా, సెప్టెంబరులో 1.84 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, దీంతో రైతులకు ఊరట కలిగిందని పేర్కొన్నారు.