Minister Uttam Kumar Reddy: ఉప్పుడు బియ్యం అదనపు కోటా ఇవ్వండి
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:19 AM
బీ సీజన్ 2024-25కు సంబంధించి ఉప్పుడు బియ్యం అదనపు కోటా మంజూరు చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి..
రాష్ట్రంలో గోదాముల సామర్థ్యాన్ని పెంచండి
కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రబీ సీజన్ 2024-25కు సంబంధించి ఉప్పుడు బియ్యం అదనపు కోటా మంజూరు చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కేంద్రాన్ని కోరారు. సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద ఎఫ్‌సీఐ ఇప్పటి వరకు 17.83లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించిందని.. మరో 10లక్షల టన్నులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు కేంద్రం 36 లక్షల టన్నుల బియ్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించిందని, ఈ మొత్తాన్ని 54 లక్షల టన్నులకు పెంచాలని కోరారు. సీఎంఆర్ గడువును జనవరి 31 వరకు పెంచాలని కోరారు. ఈ మేరకు ఉత్తమ్.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు. తెలంగాణలో మరో 15లక్షల టన్నుల గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. 2014-15 ఖరీ్‌ఫలో సేకరించిన బియ్యానికి సంబంధించి రూ.1,468కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.