Share News

Telangana Ration Dealers: రేపు రేషన్‌ దుకాణాలు బంద్‌

ABN , Publish Date - Sep 04 , 2025 | 05:21 AM

తెలంగాణ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల బంద్‌కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని....

Telangana Ration Dealers: రేపు రేషన్‌ దుకాణాలు బంద్‌

  • తెలంగాణ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు

పంజాగుట్ట, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల బంద్‌కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని డీలర్లు డిమాం డ్‌ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్‌ బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ తమకు నెలకు రూ.5వేల కనీస గౌరవ వేతనం ఇస్తామని, కమీషన్‌ పెంచుతామని హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడిచినా తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వ బియ్యం కమీషన్‌ బకాయిలతో పాటు పదేళ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు. రేషన్‌ డీలర్ల కుటుంబాలకు హెల్త్‌ కార్డులు, దుకాణాల అద్దె, బియ్యం దిగుమతి చార్జీలనూ ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 04 , 2025 | 05:22 AM