President Draupadi Murmu: ఇంధన పరిరక్షణలో తెలంగాణకు రెండోస్థానం
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:37 AM
ఇంధన పరిరక్షణలో ఉత్తమ పనితీరుతో దేశ వ్యాప్తంగా తెలంగాణ రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక...
రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న నవీన్ మిత్తల్
న్యూఢిల్లీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఇంధన పరిరక్షణలో ఉత్తమ పనితీరుతో దేశ వ్యాప్తంగా తెలంగాణ రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీఆర్‌ఈడీసీఓ) ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)లో అమలు చేసిన కూల్ రూఫ్ ఆఫ్ డెమో ప్రాజెక్టుకు ఈ అవార్డు దక్కింది. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన్ భవన్‌లో ఆదివారం జరిగిన జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులు-2025 ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ అవార్డునందుకున్నారు.