Telangana Public Service Commission: గ్రూప్-3 తుది జాబితా విడుదల
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:43 AM
గత ఏడాది నవంబరులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ఫలితాలను ఇప్పటికే ప్రకటించగా..
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది నవంబరులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ఫలితాలను ఇప్పటికే ప్రకటించగా.. అభ్యర్థుల తుది జాబితాను గురువారం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 1370 పోస్టుల భర్తీకి 2022 డిసెంబరులో నోటిఫికేషన్ విడుదల చేయగా.. గత ఏడాది నవంబరు 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది మార్చి 14న ప్రకటించారు. ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం 1370 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను విడుదల చేశారు. వెబ్‌సైట్‌లో జాబితా అందుబాటులో ఉందని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు.