Share News

Road Network Expansion: ప్రయాణం.. రయ్‌.. రయ్‌!

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:49 AM

రాష్ట్రంలో రహదారులను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమవుతోంది. 1,800 కిలోమీటర్లకుపైగా ఎక్స్‌ప్రెస్‌ వేలు, గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులు, వాటికితోడు పలు హైస్పీడ్‌ కారిడార్లు....

Road Network Expansion: ప్రయాణం.. రయ్‌.. రయ్‌!

  • రాష్ట్రంలో 1,800 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రె్‌సవేలు

  • పలు హైస్పీడ్‌ కారిడార్లు.. జిల్లాల పరిధిలో ఆరు లేన్ల రోడ్లు.. రూ.78,783 కోట్ల వ్యయం

  • ఆర్‌ అండ్‌ బీ రోడ్లు 46 వేల కి.మీ. నుంచి 1,15,000 కిలోమీటర్లకు పెంచేలా ప్రణాళిక

  • రోడ్‌ సెక్టార్‌ పాలసీ అమలుపై ముందడుగు

  • నిర్మాణం, నిధులకు ఆర్‌ఎ్‌ఫపీ తయారీకి కమిటీ

హైదరాబాద్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రహదారులను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమవుతోంది. 1,800 కిలోమీటర్లకుపైగా ఎక్స్‌ప్రెస్‌ వేలు, గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులు, వాటికితోడు పలు హైస్పీడ్‌ కారిడార్లు, జిల్లాల పరిధిలోనూ 6 వరుసలతో కూడిన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూట్‌మ్యా్‌పను రూపొందిస్తోంది. 2047 విజన్‌ డాక్యుమెంట్‌లో భాగంగా నిర్దేశించుకున్న రోడ్‌ సెక్టార్‌ పాలసీ అమలుకు కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో అభివృద్ధి చేయాల్సిన రోడ్లు, వాటి నిర్మాణం, అవసరమయ్యే నిధుల కోసం ‘రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎ్‌ఫపీ)’ డాక్యుమెంట్‌ తయారీ కోసం కమిటీని నియమించింది. ఈ మేరకు ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికా్‌సరాజ్‌ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. కమిటీకి ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ (స్టేట్‌ రోడ్స్‌, కోర్‌ రోడ్‌ నెట్‌వర్క్‌, ఆర్‌డీసీ ఎండీ) కన్వీనర్‌గా.. జాతీయ రహదారుల (ఆర్‌అండ్‌బీ) ఈఎన్సీ, గ్రామీణ రహదారుల సీఈ, ఆర్థిక శాఖ నుంచి అదనపు సెక్రటరీ/జాయింట్‌ సెక్రటరీ/డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి సభ్యులుగా ఉంటారు. ఆర్‌ఎ్‌ఫపీ తయారీతో పాటు బిడ్డర్ల నుంచి వచ్చిన టెండర్లలోని సాంకేతిక, ఆర్థికపరమైన ప్రతిపాదనలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. రోడ్‌ నెట్‌వర్క్‌ మాస్టర్‌ ప్లాన్‌ తయారీ, కీలక రోడ్ల గుర్తింపు, రోడ్ల అభివృద్ధి వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. బిడ్డర్ల నుంచి వచ్చిన టెండర్‌లను క్షుణ్నంగా పరిశీలించాకే ప్రభుత్వానికి పంపుతుంది.

తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌కు అనుగుణంగా..

తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047 డాక్యుమెంట్‌లో భాగంగా.. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం ‘రోడ్‌ సెక్టార్‌ పాలసీ ఫర్‌ తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047’ను రోడ్లు భవనాల శాఖ తయారుచేసింది. రోడ్డు భద్రతను మెరుగుపర్చడం, గ్రీన్‌ అండ్‌ స్మార్ట్‌ మొబిలిటీ, రహదారుల నిర్మాణాల ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం, అన్ని ప్రాంతాలను కలిపేలా రోడ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్‌ అండ్‌ బీ పరిధిలో ఉన్న 46వేల కిలోమీటర్ల రహదారి వ్య వస్థను 2047 నాటికి 1,15,000 కిలోమీటర్లకు పెంచేలా ప్రణాళిక రూపొందించింది. వీటిలో పలు రోడ్లను హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో అభివృద్ధి చేయనుంది.


ఎక్స్‌ప్రె్‌సవేలుగా అభివృద్ధి చేసే రోడ్లు ఇవే..

  • ఎన్‌హెచ్‌-44లో హైదరాబాద్‌-బెంగళూరు మధ్య రూ.5,221కోట్లతో ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించేందుకు కేంద్రం సమ్మతించగా డీపీఆర్‌ పనులు జరుగుతున్నాయి.

  • హైదరాబాద్‌- విజయవాడ మార్గాన్ని కూడా రూ.9,090 కోట్ల అంచనాతో ప్రస్తుతమున్న 4లేన్ల రోడ్డును 6 లేన్లకు విస్తరించి, ఎక్స్‌ప్రె స్‌వేగా మార్చనున్నారు.

  • హైదరాబాద్‌-శ్రీశైలం (ఎన్‌హెచ్‌-765) సెక్షన్‌లో 150 కి.మీ మార్గాన్ని రూ.2,746 కోట్లతో 4వరుసలకు విస్తరించనున్నారు. డీపీఆర్‌ పనులు నడుస్తున్నాయి.

  • ఎన్‌హెచ్‌-44లో నాగ్‌పూర్‌-హైదరాబాద్‌ మధ్య 397 కి.మీ. మేర 6 వరుసలకు రోడ్డు అభివృద్ధి.

  • ఫ్యూచర్‌ సిటీ నుంచి మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను 234 కి.మీ. పొడవున 6 వరుసలతో నిర్మించనున్నారు.

  • మొత్తంగా ఎక్స్‌ప్రె్‌సవేలకు దాదాపు 29,057కోట్లు ఖర్చవుతుందని అఽంచనాల్లో పొందుపర్చారు.

Updated Date - Dec 27 , 2025 | 04:49 AM