Minister Seethakka: కేరళ తరహాలో సెర్ప్ కార్యక్రమాలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:39 AM
ష్ట్రంలోని నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని పంచాయతీరాజ్...
నిరుపేద కుటుంబాల ఆర్థిక బలోపేతానికి కృషి: మంత్రి సీతక్క
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఽసీతక్క పేర్కొన్నారు. ఇందుకుగాను కేరళలో విజయవంతమైన నమూన ‘సెర్ప్’ (గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ)తరహాలో.. రాష్ట్రం లో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రత్యే క ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. సోమవారం ప్రజాభవన్‌లో జిల్లా మహిళా సమాఖ్యల అధ్యక్ష, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. అత్యంత పేదరికంలో ఉన్న వారిని గుర్తించడంలో గ్రామైక్య సంఘాలు కీలక పాత్ర పోషించాలన్నారు. వారి అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే తక్షణమే ఆదుకుంటామని, సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం తెచ్చిన జీరాంజీ చట్టాన్ని మంత్రి వ్యతిరేకించారు. జనవరి 2న అసెంబ్లీలో ప్రత్యేక చర్చ చేపట్టి, కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానంచేసి కేంద్రానికి పంపుతామని సీతక్క తెలిపారు. కేంద్రం నిధుల కోత విధించడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని, ఉపాధి హామీ సిబ్బంది భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.