Merchants Demand GST Cut: కాగితంపై జీఎస్టీ 5 శాతానికి తగ్గించాలి
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:50 AM
కాగితంపై ఉన్న 18ు జీఎస్టీని, 5 శాతానికి తగ్గించాలని రాష్ట్ర పేపర్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అభిషేక్ విజయవార్జీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు...
తెలంగాణ పేపర్ మర్చంట్స్ అసోసియేషన్
బేగంపేట, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాగితంపై ఉన్న 18ు జీఎస్టీని, 5 శాతానికి తగ్గించాలని రాష్ట్ర పేపర్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అభిషేక్ విజయవార్జీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కాగితం విలాస వస్తువు కాదని, అత్యవసర వస్తువని అన్నారు. మంగళవారం బేగంపేటలోని ప్లాజా హోటల్‌లో జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం విద్యార్థులు, ప్రచురణకర్తలు, ప్యాకేజింగ్ పరిశ్రమతో ఇలా నిత్యం ఎంతో మంది కాగితాన్ని అత్యవసర వస్తువుగా ఉపయోగిస్తున్నారని చెప్పారు. కాగితం కోసం అడవులను నరకడం లేదని, సాగుకు పనికిరాని భూముల్లోనే పెంచుతున్నామని తెలిపారు. గ్రామీణ రైతులకు ఇది ఓ ఆదాయ మార్గంగా మారిందన్నారు.