Policy Leak: ఇంటి దొంగలెవరు?
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:21 AM
రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని పారిశ్రామికవాడల్లోని భూముల వినియోగ మార్పిడికి సంబంధించిన హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్...
హిల్ట్ పత్రాల బహిర్గతంపై ఇంటెలిజెన్స్ విచారణ
రంగంలో దిగిన నిఘా బృందాలు
హైదరాబాద్, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని పారిశ్రామికవాడల్లోని భూముల వినియోగ మార్పిడికి సంబంధించిన హిల్ట్ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్) పాలసీ రూపకల్పనకు కసరత్తు జరుగుతున్నప్పుడే అందుకు సంబంధించిన పత్రాలు లీకైన అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విచారణకు ఆదేశించింది. హిల్ట్ భూముల అంశానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు విపక్షాలకు ముందే ఏవిధంగా చేరాయి? జీవో రాకముందే ఆ విషయం ఎలా బయటకు పొక్కింది? ఏయే శాఖల సిబ్బందికి ఇందులో సంబంధం ఉంది? సిబ్బంది స్ధాయిలోనే పత్రాలు బయటకు వెళ్లాయా? లేక ఉన్నతాధికారుల పాత్ర ఉందా ? అనే విషయాలపై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. నవంబరు 21న విలేకరుల సమావేశం నిర్వహించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హిల్ట్ పాలసీపై విమర్శలు చేశారు. ఈ సమావేశానికి ముందే అనగా నవంబరు 20న హిల్ట్ పత్రాలకు సంబంధించిన ఫొటోషాప్ స్లైడ్స్ బయటకు వెళ్లినట్లు ప్రభుత్వం అనుమానిస్తుంది. పరిశ్రమల శాఖలో పాలసీ తయారీ సమయంలో వాటిని లీక్ చేసింది ఏవరు? అనే విషయాలను తెలుసుకోవడానికి నిఘా విభాగం రంగంలో దిగింది. సచివాలయం లోగుట్టు బయటకు వెళ్తున్న క్రమంలో ఇంటిదొంగలను పట్టుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభించింది. పరిశ్రమల శాఖలో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు గత ప్రభుత్వంలో ఏయే చోట్ల పని చేశారు? వారిలో ఎవరైనా ప్రతిపక్ష నాయకునితో సంబంధాలు కొనసాగిస్తున్నారా? అనే విషయాలపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. హిల్ట్ పాలసీకి సంబంధించి డాక్యుమెంట్ తయారైన తర్వాత ఏయే స్ధాయి వ్యక్తుల వద్దకు వెళ్లింది? వారికి గత ప్రభుత్వంలోని వారితో సంబంధాలున్నాయా? అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి సచివాలయంలోని పలువురి అధికారులు, సిబ్బందిని నిఘా విభాగం అధికారులు ప్రశ్నించే అవకాశముందని తెలిసింది.
అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు నెలకు రెండు సార్లే!
అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరాలో నిబంధనలకు అధికారులే నీళ్లొదిలారు. నాణ్యమైన గుడ్లు, 10 రోజులకోసారి చొప్పున నెలకు మూడు సార్లు సరఫరా చేయాలని ప్రభుత్వం జారీ చేసిన టెండర్ మార్గదర్శకాలను అధికారులే తుంగలో తొక్కారు. ఆ నిబంధనలకు విరుద్ధంగా నెలకు రెండు సార్లు సరఫరా చేస్తామన్న కాంట్రాక్టర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఏకీకృత టెండర్ విధానానికి విరుద్ధంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం.. మిగిలిన గురుకులాలు, హాస్టళ్లలో గుడ్ల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది.