Mallikarjun Kharge: ఖర్గేకు రాష్ట్ర మంత్రుల పరామర్శ
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:21 AM
ఇటీవల అనారోగ్యానికి గురై బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాష్ట్ర మంత్రులు పరామర్శించారు...
బెంగళూరులో కలిసిన పొంగులేటి, దుద్దిళ్ల, కోమటిరెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఇటీవల అనారోగ్యానికి గురై బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాష్ట్ర మంత్రులు పరామర్శించారు. మంగళవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి బెంగళూరు వెళ్లి ఖర్గేను కలిసి మాట్లాడారు. త్వరగా కోలుకోని, తిరిగి ప్రజా జీవితంలో క్రియాశీలకంగా పాల్గొనాలంటూ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయా మంత్రుల శాఖలకు సంబంధించిన అభివృద్ధి, రాష్ట్ర ప్రగతి గురించిన వివరాలను శాఖల వారీగా ఖర్గేకు వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతంగా అమలవుతోందని శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.