Uttam Kumar Reddy: 19న ఛత్తీస్‌గఢ్‌కు మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:51 AM
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 19న ఛత్తీస్‌గఢ్‌వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్‌ని కలిసి.. సమ్మక్కసాగర్...
ఆ రాష్ట్ర సీఎంను కలిసి సమ్మక్కసాగర్..ప్రాజెక్టుకు ఎన్‌వోసీ కోరనున్న మంత్రి
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 19న ఛత్తీస్‌గఢ్‌వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్‌ని కలిసి.. సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) ప్రాజెక్టుకు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నీటిపారుదల ప్రణాళికతోపాటు పలు అంశాలను నివృత్తి చేసుకునేందుకు కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) 23న తెలంగాణ అధికారులతో సమావేశం కానుంది. దాంతో ఈలోగా ఎన్‌వోసీ తెచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకే ఈ నెల 16న లేదా 19న ఛత్తీ్‌సగఢ్ సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దాంతో 19న రావాల్సిందిగా అక్కడి నుంచి కబురు అందడంతో ఐదుగురు అధికారులతో కలిసి మంత్రి ఉత్తమ్ ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లనున్నారు. ప్రాజెక్టుకు వ చ్చే గరిష్ఠ వరదకు అనుగుణంగా ఏ మేరకు ముంపు ఉంటుందో.. ఆ మేరకు పరిహారం ఇవ్వడానికి తెలంగాణ తరఫున సమ్మతి తెలపనున్నారు.