Share News

Minister Konda Surekha: ఆలయాల్లో ఏర్పాట్లపై దృష్టి సారించండి

ABN , Publish Date - Nov 02 , 2025 | 04:50 AM

ఆంధ్రప్రదేశ్‌లోని కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు కీలక సూచనలు చేశారు...

Minister Konda Surekha: ఆలయాల్లో ఏర్పాట్లపై దృష్టి సారించండి

  • భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినా ఇబ్బందులు రావద్దు

  • కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఆదేశాలు

హైదరాబాద్‌, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆలయాల్లో భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ హరీశ్‌ను ఆదేశించారు. కార్తీక దిపోత్సవం ప్రత్యేక పూజలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో జరుగుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీ మేరకు ఏర్పాట్లు చేయాలని కమిషనర్‌కు సూచించారు. ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట కారణంగా మృతి చెందిన భక్తుల కుటుంబాలకు మంత్రి సురేఖ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - Nov 02 , 2025 | 04:50 AM