Agriculture Minister Tummala Nageswara Rao: ఏఐలో సత్తా చాటిన పల్లవికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్కారం
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:35 AM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచిన తాళ్లూరి పల్లవిని రాష్ట్ర వ్యవసాయ...
ఖమ్మం కార్పొరేషన్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచిన తాళ్లూరి పల్లవిని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్కరించారు. పల్లవిని విద్యార్థులందరూ స్ఫూర్తిగా తీసుకుని బాగా చదవాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే ప్రధాని మోదీ చేతుల మీదుగా పల్లవి అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. బుధవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో కలిసిన పల్లవి తల్లిదండ్రులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. కష్టాలు ఎదురైనా పట్టుదలతో కుమార్తెను చదివించారన్నారు.