Telangana Liberation Day: మన పోరాట చరిత్రకు ప్రతీక
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:35 AM
మన పోరాట చరిత్రకు ప్రతీక తెలంగాణ విమోచన దినోత్సవమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అన్నారు. నిజాయితీ, స్వాభిమానం...
తెలంగాణ విమోచన దినోత్సవం
నేటి సభకు రాజ్‌నాథ్‌సింగ్ హాజరు: రాంచందర్‌రావు
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మన పోరాట చరిత్రకు ప్రతీక తెలంగాణ విమోచన దినోత్సవమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అన్నారు. నిజాయితీ, స్వాభిమానం, ధైర్యాన్ని భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచే కాలమిది అని పేర్కొన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పరేడ్‌గ్రౌండ్స్‌లో బుధవారం జరిగే విమోచన దినోత్సవ సభకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా, కంటోన్మెంటు పార్కులో దివంగత ప్రధాని వాజ్‌పేయి విగ్రహావిష్కరణ కూడా ఉంటుందన్నారు. కాగా, విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు రాంచందర్‌రావు, ఎంపీలు కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎం. రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్‌లు స్వాగతం పలికారు. కాగా, కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఐటీసీ కాకతీయలో ఆయన్ను ప్రత్యేకంగా కలుసుకున్నారు.