Share News

Kidney Health: ప్రతి 100 మందిలో ఏడుగురికి కిడ్నీ సమస్య

ABN , Publish Date - Oct 23 , 2025 | 05:53 AM

రాష్ట్రం మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలకు రాజధానిగా మారుతోంది. ప్రతి వంద మందిలో ఏడుగురు ఏదో ఒక కిడ్నీ సంబంధిత సమ...

Kidney Health: ప్రతి 100 మందిలో ఏడుగురికి కిడ్నీ సమస్య

  • దేశంలోనే తెలంగాణలో అత్యధికం

  • 7.4% మందికి కిడ్నీ పనితీరులో లోపం.. జాతీయ సగటుతో పోలిస్తే రెండింతలు

  • బిహార్‌లో అతి తక్కువగా 0.8%.. ఐసీఎంఆర్‌-ఇండియాబీ అధ్యయనంలో వెల్లడి

  • అధిక రక్తపోటు, నియంత్రణలో లేని మధుమేహమే కిడ్నీ సమస్యలకు కారణం

  • విచ్చలవిడిగా యాంటీ ఎసిడిటీ, నొప్పి నివారణ మాత్రల వినియోగంతో ప్రమాదం

  • ఆహారం, జీవనశైలిలో మార్పులతో ముప్పును తప్పించుకోవచ్చని వైద్యుల సలహా

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలకు రాజధానిగా మారుతోంది. ప్రతి వంద మందిలో ఏడుగురు ఏదో ఒక కిడ్నీ సంబంధిత సమస్య(ఇంపెయిర్డ్‌ కిడ్నీ ఫంక్షన్‌ - ఐకేఎ్‌ఫ)తో బాధపడుతున్నారు. బయటికి ఏమీ తెలియకుండానే ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)- ఇండియాబీ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఈ అంశం వెల్లడైంది. కిడ్నీ సమస్యల విషయంలో దేశంలోనే తెలంగాణ టాప్‌లో ఉందని తేలింది. ఇటీవల ఆరోగ్యశ్రీ విడుదల చేసిన గణాంకాల్లో కూడా రాష్ట్రంలో అత్యధిక కేసులు కిడ్నీలకు సంబంధించినవేనని వెల్లడికావడం గమనార్హం. దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 25,408 మందిపై అధ్యయనం చేశామని.. దేశవ్యాప్తంగా సగటున 3.2శాతం మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని ఐసీఎంఆర్‌-ఇండియాబీ అధ్యయనం వెల్లడించింది. అదే తెలంగాణలో 7.4 శాతంగా తేలిందని, జాతీయ సగటు కంటే ఇది 2.3 రెట్లు ఎక్కువని వెల్లడించింది. చిన్న రాష్ట్రం గోవా కూడా తెలంగాణతో కలిసి (7.4 శాతం)తో దేశంలో టాప్‌లో నిలిచిందని తెలిపింది. బిహార్‌లో అతి తక్కువగా 0.8శాతమే బాధితులు ఉన్నట్టు వెల్లడించింది. కిడ్నీ జబ్బులకు ప్రధాన కారణంగా అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం వ్యాధులే కారణమని అధ్యయనం పేర్కొంది.


జాతీయ సగటు కంటే రెండింతలకుపైగా..

దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 25,408 మందిపై అధ్యయనం చేశామని.. దేశవ్యాప్తంగా సగటున 3.2శాతం మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని ఐసీఎంఆర్‌-ఇండియాబీ అధ్యయనం వెల్లడించింది. అదే తెలంగాణలో 7.4 శాతంగా తేలిందని, జాతీయ సగటు కంటే ఇది 2.3 రెట్లు ఎక్కువని వెల్లడించింది. చిన్న రాష్ట్రం గోవా కూడా తెలంగాణతో కలిసి (7.4 శాతం)తో దేశంలో టాప్‌లో నిలిచిందని తెలిపింది. బిహార్‌లో అతి తక్కువగా 0.8శాతమే బాధితులు ఉన్నట్టు వెల్లడించింది. కిడ్నీ జబ్బులకు ప్రధాన కారణంగా అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం వ్యాధులే కారణమని అధ్యయనం పేర్కొంది.

తెలంగాణలో 50లక్షల మంది వరకు బాధితులు

దేశంలోనే అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఆరోగ్యశ్రీ, వైద్యారోగ్య శాఖల గణాంకాల ప్రకారమే.. ఈ సమస్యలతో బాధపడుతున్నవారు 50 లక్షల మంది వరకు ఉన్నారు. ఈ క్రమంలోనే కిడ్నీ సమస్యల ప్రమాదం పెరిగిపోతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, అధికంగా ఉప్పు, చక్కెర వాడకం, ఊబకాయం వంటివి ఈ పరిస్థితికి ఆజ్యం పోస్తున్నాయని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. కిడ్నీ జబ్బులను సైలెంట్‌ కిల్లర్‌గా పిలుస్తారని, చాలా సందర్భాల్లో లక్షణాలు బయటపడేసరికే మూత్రపిండాలు 70-80 శాతం పాడవుతాయని హెచ్చరిస్తున్నారు.


అధ్యయనంలో తేలిన ముఖ్యాంశాలివే..

  • గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటా కూడా కిడ్నీ వ్యాధుల తీవ్రత ఒకే స్థాయిలో ఉంది.

  • జాతీయ స్థాయిలో పట్టణాల్లో 3.3ు, గ్రామాల్లో 3.2ుమంది కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నారు.

  • మహిళలతో (2.6ు) పోలిేస్త పురుషుల్లో (3.8ు) ఈ సమస్య ఎక్కువ.

  • హైబీపీ, షుగర్‌ లేనివారితో పోలిస్తే.. ఆ రెండు సమస్యలు ఉన్నవారిలో కిడ్నీ జబ్బుల ప్రమాదం ఆరు రెట్లు ఎక్కువగా ఉంది.

  • కేవలం మధుమేహం ఉన్నవారిలో ముప్పు 3.2 రెట్లు ఎక్కువగా, బీపీ ఒకటే ఉన్నవారిలో ఇది 2.4 రెట్లు అఽధికంగా సమస్య ఉంది.

  • దేశంలో నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కిడ్నీ బాధితులు 4-6 శాతంలోపు ఉండగా, మరో నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతానికి కంటే ఎక్కువగా ఉన్నారు.

  • అత్యంత తీవ్రమైన (క్రానిక్‌) కిడ్నీ వ్యాధి (సీకేడీ) ఎక్కువగా ఉందని ఐసీఎంఆర్‌ అధ్యయనంలో తేలగా.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సీఏఆర్‌ఆర్‌ఎ్‌సఅధ్యయనంలో మాత్రం మహిళలలో ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.

30 ఏళ్లలోపే మధుమేహం, హైబీపీ వస్తున్నాయి..

రాష్ట్రంలో మధుమేహం, అధిక రక్తపోటు బాధితులు భారీగా పెరుగుతున్నారు. 30 ఏళ్లలోపే వీటి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. జీవనశైలి, ఆహార నియంత్రణ పాటించకపోవడం, మందులు సరిగా వాడకపోవడంతో మధుమేహం నియంత్రణలో ఉండక కిడ్నీలు పాడవుతున్నాయి. విపరీతంగా నొప్పి నివారణ మాత్రల వాడకం, గ్యాస్‌-ఎసిడిటీని తగ్గించే మందులు వాడటం, ఆయుర్వేదిక్‌, హోమియోపతి, అల్లోపతి కలగలపి వాడటం వంటివి సమస్యను పెంచుతున్నాయి. జన్యుపరమైన లోపాల వల్ల కిడ్నీ జబ్బుల బారినపడే వారి సంఖ్య కూడా మనదగ్గర ఎక్కువగానే ఉంటోంది. అందువల్ల 30ఏళ్లు దాటినవారు ఏటా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.

- డాక్టర్‌ శ్రీభూషణ్‌ రాజు, నెఫ్రాలజిస్టు, జీవన్‌దాన్‌ నోడల్‌ ఆఫీసర్‌

Updated Date - Oct 23 , 2025 | 07:00 AM