Share News

Komatireddy Venkat Reddy: హరీశ్‌ కొత్త పార్టీ.. కవిత వేరు కుంపటి

ABN , Publish Date - Oct 26 , 2025 | 04:21 AM

బీఆర్‌ఎస్‌లో కీలకంగా ఉన్న హరీశ్‌రావు కొత్త పార్టీ కోసం చూస్తున్నారని, కవిత ఇప్పటికే వేరే కుంపటి పెట్టుకుందని, దాంతో బీఆర్‌ఎస్‌ నేతలు అయోమయంలో ఉన్నారని...

Komatireddy Venkat Reddy: హరీశ్‌ కొత్త పార్టీ.. కవిత వేరు కుంపటి

బీఆర్‌ఎస్‌లో కీలకంగా ఉన్న హరీశ్‌రావు కొత్త పార్టీ కోసం చూస్తున్నారని, కవిత ఇప్పటికే వేరే కుంపటి పెట్టుకుందని, దాంతో బీఆర్‌ఎస్‌ నేతలు అయోమయంలో ఉన్నారని, నిరాశలో కూరుకుపోయి మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించిందిన్నట్టు.. వారి ప్రభుత్వంలో కాళేశ్వరం, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం, ధరణి, గొర్రెల పంపిణీ సహా అన్ని పథకాల్లో స్కాంలు చేయడంతో ఇప్పుడు ప్రజాప్రభుత్వం చేపట్టిన పనుల్లోనూ వారికి స్కాములే కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఆర్‌ అండ్‌ బీ పరిధిలోని పలు రోడ్లను హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌)లో అభివృద్ధి చేసి, రహదారులను అద్దంలా మారుస్తామనేసరికి వారి గుండెలు అదురుతున్నాయన్నారు. హ్యామ్‌ రోడ్లలో రూ.8వేల కోట్ల మేర స్కామ్‌ జరగబోతోందని, అది హ్యామ్‌ కాదు పెద్ద స్కామ్‌ అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి శనివారం ఆరోపించారు. దానిపై ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. హ్యామ్‌ రోడ్లపై ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే అజ్ఞానంగా ఉన్నాయని, అందుకు విచారిస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Oct 26 , 2025 | 04:21 AM