ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణ జన సమితి
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:32 PM
ప్రజాస్వామ్య పరిరక్షణ పాలన, ప్రజల కోసం నిజాయితీగా పని చేసే ప్రత్యామ్నాయ రాజకీయ జన శక్తిగా తెలంగాణ జన సమితి నిలుస్తుందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
ప్రొఫెసర్ కోదండరాం
మంచిర్యాల క్రైం, నవంబరు 16(ఆంరఽధజ్యోతి) : ప్రజాస్వామ్య పరిరక్షణ పాలన, ప్రజల కోసం నిజాయితీగా పని చేసే ప్రత్యామ్నాయ రాజకీయ జన శక్తిగా తెలంగాణ జన సమితి నిలుస్తుందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంచిర్యాల పట్టణంలో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జి ల్లా ప్లీనరీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావే శానికి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాబన్న అధ్యక్షత వహించారు. అందెశ్రీకి ని వాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభు త్వం చేసిన దాడులను ప్రస్తావిస్తూ ఇప్పుడు రాష్ట్రంలో స్వేచ్చ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కా రం దిశగా ప్రయత్నిస్తామన్నారు. ఓట్లు, నోట్లు కేంద్రంగా కాదు ప్రజల జీవి తాలు, ప్రజల సమస్యలు కేంద్రంగా రాజకీయం జరగాలన్నారు. ఈ సందర్భం గా పలు తీర్మాణాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం నూతన కమిటి ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాంచందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గో నెల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా ఎండి సిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నీరటి రా జన్న, విద్యార్ధి యువజన సమితి జిల్లా అధ్యక్షుడిగా బచ్చలి ప్రవీన్ కుమార్‌ను ఎన్నుకున్నారు.